ఈ 27 నామములు పఠించటం ద్వారా కరోనా వంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు

0
6154

శ్రీ హనుమంతునకు సంబంధించిన వానరజాతి పుట్టుకకు ఒక పెద్ద కారణం ఉంది. దేవదానవులు సముద్ర మథనం చేసిన సమయంలో ధన్వంతరి, లక్ష్మి, చంద్రుడు, అప్సరసలు, కల్పవృక్షాదులు ఇలా మంచివి రావటమే కాదు. చెడులు కూడా కొన్ని వచ్చాయి. అమృతం వచ్చే ముందు హాలాహలం పుట్టినట్లు ధన్వంతరీత్యాదులకు ముందు కొన్ని జనపద ధ్వంసకాలు పుట్టాయి. అంటే ఊళ్ళకు ఊళ్ళను చంపి వేసే వ్యాధులన్నమాట. మశూచి వంటివి ఆ కోవకు చెందినవే. అవి ఊళ్ళ మీద పడి జనులను నాశనం చేస్తాయేమో అనే భయం కల్గింది అందరకూ. మునిజనగణాలన్నీ బ్రహ్మదేవుని ప్రార్థించాయి. అంతట బ్రహ్మదేవుడు ఆ జనపద ధ్వంసకాల నుండి రక్షణ కోసం వానరజాతిని సృష్టించాడు. ఆ వానరజాతి చేసే ధ్వనులకే భూత ప్రేతాదులు, కలరా, మలేరియా వంటి జనపద ధ్వంసకాలు పలాయనం చిత్తగించేవి. అందుకే హనుమంతుని నామాలలో “భూభుక్కార అపారాతి గర్వాయ నమః కిల్యారావ హతారాతి గర్వాయ నమః, కిలికిల్యారవతీస్త భూతప్రేత పిశాచకా:” వంటి నామాలు ఏర్పడ్డాయి.

ఆ వానరజాతి యందు మేటి అయిన హనుమంతుడంటే దుష్టశక్తులన్నింటికీ మహాభయం. నీతాదేవిని వెదకటం కోసం హనుమంతుడు లంకకు వెళ్ళాడు. అందు ప్రవేవించే ముందు ఆ లంకకు కాపరియైన లంకిణి ఆంజనేయుని నిలేసింది. “కస్యం కేనచ కార్యేణ ఇహప్రాప్తో వనాలయ!” ఓయీ! వానరుడా ! ఎవరు నీవు ? ఏ పనిమీద ఇక్కడకు వచ్చా”వని ప్రశ్నించింది. ‘అసలు నీ వెవరో ముందు చెప్పు’ మని మారుతి ఎదురు ప్రశ్నించాడు. అంతట అది తాను లంకను కాపలా కాచేదానినని, రాక్షసరాజు రావణుని పరివారంలోని లంఖిణినని చెప్పుకొంది. తాను ఇక్కడి సుందరవనాలు చూచి వెళ్ళటానికి వచ్చానని హనుమంతుడు చెప్పాడు. 

ఆ బలగర్వితురాలు లంకిణి హనుమంతుని మోగింది. వెంటనే ఆంజనేయుడు ఆడది అనే అభిప్రాయంతో ఎడమచేతితో కొట్టేసరికే అది అవయవాలు పట్టు తప్పగా బిగ్గరగా అరుస్తూ నేలకూలింది. లోకములను నాశనం చేసే విషూచి అనే ఘోరరూపం కల రాక్షసి తన సోదరి వివశ అయినట్లు తెలిసి బ్రహ్మలోకం నుండి పరుగున లంకకు వచ్చింది. కర్కటి అనే నామాంతరం కల అది ‘ఓరీ వానరుడా! నా సోదరి లంకిణిని ఇలా చేసిన నిన్ను నేను ఒక్క క్షణములో చంపుతాను చూడు’ మంటూ తన చేతిలోని ఒక వంకర దండంతో హనుమంతుని కొట్టబోయింది.

దానిని లోకవినాశకారిగా కరోనా ప్రతిరూపమనదగిన కర్కటిగా గ్రహించి దాని చేతి నుండి వక్రదండం తీసికొని దానితోనే ఆ ఘోర కర్కటిని కొట్టగా అది నేల పై పడి చచ్చింది. అదే సమయంలో లోక పితామహుడైన బ్రహ్మ అక్కడకు పరుగున వచ్చాడు.రోషావేశంతో ఉన్న హనుమంతుని చూచాడు. ప్రశాంత చిత్తుడై ఇలా అన్నాడు.

“ఓ ఆంజనేయా! నీవు జ్ఞానివి. లోకానికి మహోపకారం చేశావు. ఇపుడు నీ చేత చంపబడిన కర్కటి విషూచి అని, కర్కశ అని చెప్పబడుతూ ఉంటుంది. అది లోకం మీద పడి విలయతాండవం చేస్తుంది. ఈ దుష్టురాలిని లోకనాశకురాలిని విశ్వక్షేమం కోసం బ్రహ్మలోకంలోనే కట్టేసి ఉంచాను. హఠాత్తుగా ఇది బంధాలు ట్రెంచుకొని వచ్చింది. లోకంలో పడి ఎక్కడ జననాశం చేస్తోందో అని ఆందోళన చెందాను. ఇట్టి లోకవినాశకారిణిని సంహరించావు కాబట్టి నీకు స్త్రీ హత్యాదోషము అంటకుండునట్లు వరమిస్తున్నాను. కల్పాంతము వరకు నీవు జీవింపగలవు. ఈ సంఘటన లోకహితము కొరకే ఏర్పడినది. ఇటువంటి విషూచి వంటి జనపద ధ్వంసకాలు ప్రబలినపుడు ఎవ్వరయితే నీ యొక్క ఇరువది యేడు నామాలు పఠిస్తారో వారికి ఆ మహా వ్యాధులు సోకవు.

“సప్తవింశతి నామాని – లోకే తవ పఠంతి యే,

విషూచీ వ్యాధయస్తేషాం – న భవని కదాచన!” 

అని చెప్పాడు. కాబట్టి హనుమంతుని 27 నామములు పఠించటం ద్వారా జనపద ధ్వంసకమయిన కరోనా వంటి వాటి నుండి రక్షణ పొందవచ్చు. ఆ నామములు

హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహాబలః 
కపీన్ద్ర: పింగళాక్షశ్చ – లంకాద్వీప భయంకరః || 

ప్రభంజనసుతో వీరః – సీతాశోక వినాశకః 
అక్షహంతా రామసఖః – రామకార్య ధురంధరః || 

మహౌషధి గిరేన్హారీ – వానర ప్రాణదాయకః 
వారీశతారకశ్చైవ – మైనాకగిరి భంజనః || 

నిరంజనో జితక్రోధః – కదళీవన సంవృతః 
ఊర్ధ్వరేతా మహాసత్త్వా: సర్వమంత్ర ప్రవర్తకః || 

మహాలింగ ప్రతిష్టాతా – భాష్యకృ జ్జగతాం వరః 
శివధ్యానపరో నిత్యం – శివపూజా పరాయణః || 

సప్తవింశతి సంఖ్యాక – న్యేతాని శ్రీ హనుమంత:||

అని ఈ నామములు నిత్యం పఠించుట ద్వారా విధ్వంసకారి అయిన కరోనాబారినుండి అందరూ రక్షింపబడుదురు గాక!    

కరోనాకు ఆప్తులను, స్నేహితులను కోల్పోయారా?