సకల సిద్ధి ప్రదాత గణపతి పులే | Siddhi Ganapathi Pule

0
3430
సకల సిద్ధి ప్రదాత గణపతి పులే
సకల సిద్ధి ప్రదాత గణపతి పులే

సకల సిద్ధి ప్రదాత గణపతి పులే | Siddhi Ganapathi Pule

పశ్చిమ భారత దేశం లో గోవా చాలా ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. మహారాష్ట్ర లోని రత్నగిరి జిల్లాలో కొంకణ సముద్ర తీరాన గణపతి ఫూలే చాలా చిన్న ఊరు. కానీ అక్కడి వినాయకుని దర్శనానికి జనం తండోప తండాలుగా వస్తారు. అది 4000 ఏళ్ల కిందటి స్వయంభూ వినాయకుని ఆలయం. ఇది ప్రపంచం లోనే చాలా పురాతనమైన దేవాలయం. సాధారణంగా దేవతలు తూర్పు ముఖంగా ప్రతిష్టించబడి ఉంటారు. కానీ ఇక్కడి స్వయంభూ వినాయకుడు పశ్చిమ ముఖాన్ని కలిగి ఉంటాడు. ఆయన ఆ దిక్కుకి పాలకునిగా దర్శనమిస్తాడు.

భారత దేశం లోని ప్రసిద్ధ స్వయంభూ క్షేత్రాలైన అష్ట గణపతులలో గణపతి ఫులే క్షేత్రం ఒకటి. చుట్టూ పూల మొక్కలు, మామిడి, కొబ్బరి చెట్లతో శుభ్రమైన సముద్ర తీర ప్రాంతం తో ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here