అశ్వత్త పత్రం

0
945

Schofield barracks (job 998)

వినాయకాయ నమః అశ్వత్ధ పత్రం సమర్పయామి

అశ్వత్ధ వృక్షాన్ని తెలుగులో రావి చెట్టు అంటారు.శాస్త్రీయ నామము(Ficus religiosa). సంస్కృతంలో బోధితరు, పిప్పల, గజాశన, యాజ్జీక, గుహ్య పుష్ప అనేవి పర్యాయపదాలు. శ్రీ మహావిష్ణువునకు ఆవాసమైనందున అచ్యుతావాసమని, మన దేవాలయములలో రావి – వేపలను నారాయణ- లక్ష్మీ వృక్షములుగా పెంచి పూజిస్తారు. ఈ వృక్షపు ఛాయలో బుద్ధ భగవానునికి జ్ఞాన సిద్ధి కలిగినందున బోధితరువు అని పేరు వచ్చింది. దీని పడకలను యజ్ఞ సమిధలుగా వాడతారు కనుక యాయాజ్ఖ్యి అని పేరు. అశ్వత్ధ ప్రదక్షిణమువలన వంధ్యత్వము తొలగి స్త్రీలు సంతానవంతులవుతారు.

దీనిని యోని శోధకముగను, ప్రమేహహరముగను వాడతారు. వైద్య శాస్త్రంలోను, దేవప్రతిష్ఠ సంభారాలలో పంచ వల్కలములు, పంచపల్లవములుగా వాడతారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here