పబ్లిక్ డిమాండ్ మేరకు దూరదర్శన్‌లో రామాయణం పునః ప్రసారం

0
680

మీకు రామాయణం సీరియల్‌ గుర్తుందా.. 90’స్ లో దేశాన్ని ఒక ఊపు ఊపేసిన ధారావాహిక. ఎంతోమంది ఆదరాభిమానాలను సొంతం చేసుకుని టెలివిజన్‌ రంగంలో ఓ మైలురాయిగా నిలిచింది.

కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమవుతున్న నేపథ్యంలో ప్రజలు బయటకు రాకుండా ఇంట్లోనే ఉండేలా చూడాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా హిందువులు ఎంతో ఆసక్తిగా చూసే రామాయణం సీరియల్‌ను మరోసారి టీవీల్లో ప్రసారం చేయాలని కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర ప్రసారశాఖమంత్రి ప్రకాశ్‌ జవడేకర్‌ శుక్రవారం ట్విటర్‌ వేదికగా ప్రకటించారు.

మార్చి 28 (శనివారం) నుంచి ఈ సీరియల్‌ ప్రారంభం కాబోతుంది. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు, అలాగే సాయంత్రం 9 నుంచి 10 గంటల వరకు డీడీ నేషనల్‌ (దూరదర్శన్‌) చానల్‌లో ‍ప్రసారం కానుంది’ అని కేంద్రమంత్రి తెలిపారు.