అసలు దసరా పండుగను జరుపుకోవడములో గల వాస్తవ ఆంతర్యము ఏమిటి ? | Reasons Behind Celebrating Dasara in Telugu

1
9854
reason-behind-celebrating-dasara-hariome
అసలు దసరా పండుగను జరుపుకోవడములో గల వాస్తవ ఆంతర్యము ఏమిటి ? | Reasons Behind Celebrating Dasara in Telugu

The Story of Vijaya Dashami

2విజయదశమిని జరుపుకోవడానికి వాడకంలో ఉన్న పురాణా గాధ

మనుషులు గత జన్మ కర్మ ఫలితముగా వ్యాధి రూపేణా, ఋణ రూపేణా, శత్రు రూపేణా భాధపడుతూ ఉంటారనేది శాస్త్రము చెబుతుంది. ఆ విధముగా కర్మ జీవులైన మానవులు జన్మను తీసుకున్నాక గత జన్మ రుగ్మతలను మరచి తిరిగి మరలా మరలా పాపాలు చేస్తూ ఉంటారు. ఆయా పాప కర్మలను అనుసరించి వారిని తగిన విధముగా అనారోగ్యపరంగానో, శత్రు రూపములోనో, లేక మృత్యురూపంలోనో సమస్యలను సృష్టించి శిక్షించడానికి ఆయా సమయములలో యమ ధర్మరాజు ఉపక్రమించడము జరుగుతుంది.

ఈ విధంగా జీవులను తగిన విధంగా శిక్షించడానికి ఉపక్రమించిన యమ ధర్మరాజుకి

  1. ఒకవైపు కోర (దంతము) శరదృతువు లో అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయములో బయటకు రావడము జరుగుతుంది.
  2. రెండవ కోర చైత్ర మాసం ప్రారంభములో ఉన్న 9 రోజులలో వస్తుందని శాస్త్ర ఉవాచ
    అది మొదలు ఈ సమయంలో ప్రపంచములోని అన్నీ ప్రదేశములలో అంతుతెలియని లేదా తీవ్రమైన అంటు వ్యాధులు ప్రభలీల్లడము, లేదా అనుకోని సమస్యలు శత్రువుల వలన ఏర్పడటము జరిగి ప్రజలు నానా అనారోగ్యముల పాలై తీవ్రమైన భాధలను అనుభవించడము, అందులో కొందరు మరణాలను కూడా పొందడము జరుగుతుంది.

(మనం గమనించినట్లైతే ప్రతి సంవత్సరము కూడా మిగతా రోజులతో పోలిస్తే ఈ రోజులలో యాక్సిడెంట్స్ ద్వారా గాని, వ్యాధుల ద్వారా గాని జరిగే మరణాల సంఖ్య ఎక్కువని గణాంకాలు చెబుతున్నాయి. మీరు గమనించవచ్చు.)

అందువలన ఈ సమయంలో అమ్మవారిని శాస్త్రోక్తంగా పూజించి అర్చించి ఉపాసనాది అనుష్టానములను నిర్వహించడము ద్వారా ఆయా దోషముల నుండి విముక్తి కల్గి ఋణ, రోగ, శత్రు భాధలనుండి బయట పడుటకు అవకాశము కలదు .

అంతేకాకుండా ఉపాసనకు ఒక రోజులో అత్యంత ముఖ్యమైన లేదా ఉత్క్రుష్టమైన కాలము ఏమిటంటే అది బ్రహ్మ ముహూర్త కాలము అనగా సూర్యోదయమునకు 48 నిముషముల ముందు సమయము.

సంవత్సరమునంతా కూడా ఒక రోజుగా భావన చేసినట్లైతే ఈ శరదృతువులో వస్తున్న అశ్వియుజ శుద్ద పాడ్యమి తిధి నుండి నవమి వరకు గల సమయము బ్రాహ్మీ ముహూర్తము అవుతుంది. అనగా ఒక సంవత్సరానికి మొత్తం కూడా తెల్లవారు ఝాము లేదా బ్రాహ్మీ ముహూర్త కాలము ఏమిటంటే అది దేవి నవరాత్రుల కాలము అని చెప్పవచ్చు .

అందువలన ఈ సమయము లో చేయు అన్నీ రకములైన అనుష్టానములు, జపములు, ఉపాసనలు త్వరగా ఫలించి సిద్దించుటకు అవకాశం ఉన్నది. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here