శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం | Rebuilt Anakapalli Nookambika Temple

0
346
Anakapalli Nookambika Temple
Anakapalli Nookambika Temple

When is Rebuilt of Anakapalli Nukambika Temple?!

1శ్రీ నూకాంబిక అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం

ఆంధ్ర ప్రదేశ్ లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అనకాపల్లి నూకాంబిక అమ్మ వారి ఆలయం. ఇప్పుడు ఈ ఆలయ పునర్నిర్మాణానికి అన్ని సిద్దమవుతున్నాయి. సుమారుగా 6.5 కోట్ల రూ.ల అంచనా వ్యయంతో 2 దశల్లో ఆలయ నిర్మాణం పూర్తి చేయాలని దేవదాయశాఖ అధికారులు నిర్ణయించారు. జూన్ 8వ తేదీన ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమి పూజ చేయడానికి అధికారులు సిద్దమవుతున్నారు.

మొదటి దశలో 3 కోట్ల రూపాలయలతో అంతరాలయం, గర్భాలయం, అనివేటి మండపాలను పూర్తిగా రాతితో నిర్మిస్తారు. రెండో దశలో 3.5 కోట్ల రూపాలయలతో ఆలయ ప్రాకార మండపంతో పాటు ఇప్పుదు గుడికి తూర్పు దిశలో ఉన్న రాజగోపురం మాదిరిగా ఉత్తర, దక్షిణ, పడమర దిశల్లో మూడంతస్థులతో రాజగోపురాలను నిర్మిస్తారు. ఈ నిర్మాణ భాద్యతలను కాణిపాకం వినాయక ఆలయం, తలుపులమ్మలోవ, రామతీర్థాలు ఆలయాల పనులు చేసిన శ్రీధర్‌రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో చేయబోతున్నారు.

ప్రస్తుతం 14.5 అడుగులు ఉన్న గర్భాలయాన్ని అదే స్థానంలో కొత్తగా నిర్మించనున్నారు. 5 అడుగుల వెడల్పు ఉన్న అంతరాలయాన్ని 12.5 అడుగులకు పెంచుతారు. 14 అడుగులు ఉన్న అనివేటి మండపాన్ని 35 అడుగులకు విస్తరిస్తారు. ప్రస్తుతం ఆలయ నిధులు సుమారు రూ.5.5 కోట్లు వేర్వేరు బ్యాంకుల్లో స్థిర డిపాజిట్ల రూపంలో ఉన్నాయి. ఇంక తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి ట్రస్టు నుంచి రూ.3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. వచ్చే సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెల ‌నాటికి (అంటే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతర) వరకు ఆలయ పునర్నిర్మాణ పనులు పూర్తి అవుతాయన్న ఆశాభావాన్ని ఆలయ కమిటి వ్యక్తం చేసింది. మరిన్ని ఆలయ వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Back