శని దోషం నివారణకు శాంతులు

0
8387

shani dosha

1. ప్రతిరోజూ మధ్యాహ్నం కాకులకు బెల్లంతో కలిపిన నల్లనువ్వులు పెట్టాలి.
2. ఒక స్టీలు పాత్రలో నల్లనువ్వులు, ఉప్పు, మేకు, నల్లదారం ఉండ, నువ్వుల నూనె, నల్లబొగ్గు, నల్లని వస్త్రమును దానం చేయండి.
3. శనిగ్రహ జపం చేయించి బ్రాహ్మణుకి శక్తిమేరకు దానం చేయండి.
4. జాతినీలం ఎడమచేతి మధ్య వేలికి వెండితో చేయించి, శనివారం ఉదయం 6 గంటలకు ధరించండి. 1.25కే.జీ ల నల్ల నువ్వులు దానం చేయండి.
5. నవగ్రహములలో శని విగ్రహమునకు నువ్వుల నూనెతో తైలాభిషేకము చేసి స్టీలు ప్రమిదలో 19 నల్ల వత్తులతో దీపారాధన చేసి నలుపు వస్త్రములు దానం చేయండి.
6. 40 రోజులు నవగ్రహ ప్రదక్షిణాలు చేసి చివరి రోజున శని పూజ, తైలాభిషేకం చేసి స్తోత్ర పారాయణం చేయండి.
7. నీలమేఘ వర్ణం గల పుష్పములు, నల్ల వస్త్రములు సమర్పించి దానం చేయండి
8. మండలపూజ, అయ్యప్పదీక్ష (మకరజ్యోతి దర్శనం) ద్వారా శని అనుగ్రహ పాత్రులు కండి.
9. 19సార్లు శని తైలాభిషేకం చేయించి నువ్వులు దానం చేయండి ప్రతిరోజూ శని శ్లోకం 19 సార్లు పఠించండి.
10. శని ధ్యాన శ్లోకాన్ని రోజుకు’ 190 మార్లు చొప్పున 190 రోజులు పారాయణ చేయండి.
11. శని గాయత్రి మంత్రంను 19 శనివారములు 190 మార్లు పారాయణం చేయండి.
12. శని గాయత్రి మంత్రంను 40 రోజులలో 19000 మార్లు జపం చేయండి.
13. 19 శనివారం నవగ్రహాలకు 190 ప్రదక్షిణాలు చేసి 1.25కే.జీ. నువ్వులు దానం చేయండి.
14. మందపల్లిలోని శనేశ్వరుని దేవస్థానంకు ఒక శనివారం లేదా శనిత్రయోదశి నాడు దర్శించి తైలాభిషేకం చేయించండి.
15. శనివారం రోజున నువుండలు, నువ్వూ జీడీలు పేదలకు సాధువులకు పంచి పెట్టండి.
16. 19 శనివారంలు ఉపవాసం ఉండి చివరి శనివారం ఈశ్వరునికి అభిషేకం మరియు శని అష్టోత్తర పూజ చేయవలెను
17. తమిళనాడులో తిరునళ్ళూరు దేవస్థానంను దర్శించి శని హోమం చేయండి.
18. షిర్డీ పుణ్యస్థలందగ్గరలో శని శింగణాపూర్ దర్శించి స్వయంగా తైలాభిషేకం చేయండి.
19. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వరుని దేవాలయంలోని శని ప్రత్యేక దేవాలయం దర్శించితైలాభిషేకం చేయండి.

ఏలినాటి శనికి శాంతి మార్గములు

1. శనీశ్వరుడు ప్రతి రాశిలో 2 ½ సంవత్సరాలు సంచరిస్తాడు, అలా మూడు రాసులలో శని గోచార రీత్యా 12, 1, 2 స్థానంలో 7 ½ సంవత్సరాలు సంచరించే కాలంను ఏలినాటి శని అంటారు. శని చతుర్ధ స్థానంలో గోచారరీత్యావున్నచో అర్దాష్టము శని అని, అష్టమ స్థానంలో వున్నచో అష్టమ శని అని అంటారు. ఒక వ్యక్తి జీవితంలో 7 ½ సంవత్సరాలు ఏలినాటి శని మూడుసార్లు వస్తుంది. మొదటి దానిని మంగు శని అని, రెండవది పొంగు శని అని, మూడవ దానిని మరణ శని అని అంటారు.

1. షిర్డిలోని ద్వారకామాయి ధుని యందు నల్లనువ్వులు, కొబ్బరు కాయలు సమర్పించండి.
2. శనిదోష నివృత్తికి నలమహారాజు చరిత్రను పారాయణ చేయండి.
3. దగ్గరలో ఉన్న శ్రీసాయి దేవాలయానికి వెళ్ళి ధునిలోని నల్లనువ్వులు, నవధాన్యాలు వేసి 9 మార్లు ప్రదక్షిణాలు చేయండి. ఇలా 19 శనివారములు చేయండి.
4. శివపంచాక్షరీ మంత్రాన్ని జపించుటగాని, అభిషేకం కాని చేయండి.
5. శనివారం నాడు ఆంజనేయస్వామి, శివాలయం, శ్రీకృష్ణ ఆలయాల్లో ప్రసాదములు పంచిపెట్టండి. అన్నదానం చేయండి.
6. శనివారం నూనెలు, నూనె వస్తువులు కొనకూడదు. నల్ల ఆవులకు, నల్ల కుక్కలకు ఆహారం పెట్టినచో మంచిది.
7. శనిత్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయండి.
8. ప్రతి శనివారం ఒంటికి నువ్వుల నూనె రాసుకుని, గంట తర్వాత తలస్నానం చేయండి.
9. ప్రవహించే నీటిలో నల్ల నువ్వుల నూనె, బొగ్గులు, మేకులు, నవధాన్యాలు కలపండి.
10. శనివారం ఉదయం అన్నం ముద్దలో నువ్వులనూనె కలిపి నైవేద్యం చేసి కొద్దిగా తిని, ఎవరూ తొక్కని ప్రదేశములో వదిలి వేయాలి. ఇలా శనివారాలు చేయాలి.
11. మయూరి నీలం కుడిచేతి మధ్య వేలుకి ధరించండి.
12. శనివారం 19 సంఖ్య వచ్చునట్లుగా దక్షిణ సమర్పించండి.
13. శ్రావణమాసంలో 19 రోజులు దీక్ష, శని తైలాభిషేకం చేస్తే చాలా మంచిది.
14. తీరికలేనివారు కనీసం శని శ్లోకం 19 మార్లుగాని శని మంత్రం 190మార్లు పారాయణ చేయండి.
15. మీ దగ్గరలో ఉన్న శివాలయం/ ఆంజనేయస్వామి ఆలయానికి వెళ్ళి ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలనుండి 7 గంటల వరకూ 190 ప్రదక్షిణలు చేయండి.
16. తూర్పుగోదావరి జిల్లాలోని పెద్దాపురం మరగిరి పాండవుల మెట్టపైన వున్న శనీశ్వర ఆలయం దర్శింhచి తైలాభిషేకం జరపండి. శనీశ్వర కళ్యాణం దర్శించుకుంటే మంచిది.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here