సకలదృష్టి నివారణకు మార్గం | Nara Disti Remedies in Telugu

0
3423

1935370_208775339461447_6124196714321766767_n

1. నరఘోష యంత్రం -సకలదృష్టి నివారణ..!

‘నరుని కంటికి నల్లరాయి కూడా పగలును’ అనేది ఒక నానుడి. అవును.. నరుని దృష్టిలో అతనికే తెలియని దుష్ట అగ్ని శక్తి వుంటుంది.

అందుకే దేవాలయం ప్రతిష్ఠ జరిగిన తర్వాత దేవతా మూర్తిని ముందుగా భక్తులకు అద్దంలో దర్శించిన తర్వాతే నిజ దర్శనం చేయిస్తారు.

నర దృష్టి అభివృద్ధిని చిన్నాభిన్నం చేసి, బాధలకు గురి చేయును. ఈర్ష్య, ఆసూయ, ద్వేషాదులు మనిషి అభివృద్ధిని కుంటుపడేలా చేయును.

ఈ నరఘోష యంత్రం ధరించిన వారికి పది దిక్కుల యందు ఎవరు ఏ దిక్కు నుంచి ఘోచించిన దిష్టి తగలకుండా కాపాడును. వారి కను దృష్టి తిరిగి వారి వద్దకే పోయేలా చేయును.

ఈ యంత్రంలో ఉండే పది త్రిశూలాలు, పది దిక్కుల నుంచి వచ్చే నరఘోషను, దిష్టి దోషాన్ని, ప్రయోగ దోషాలను, ఈర్ష్య, అసూయలను పారద్రోలుతుంది. అష్ఠదిక్పాలకులు అనుగ్రహం కలుగ చేసి, మట్టిలో నుంచి దోషాలను హరించి ఆయుర్థాయము, ఇంటికి పూర్వ వైభవం చేకూర్చును.

గృహంకు ప్రవేశ ద్వారం ఎదురుగా నరఘోష యంత్రం ఉంటే.. అది నరఘోష లేదా నరదృష్టి నుంచి వచ్చే అనార్థాలను, అడ్డంకులను ఇంటి బయటకే పంపించి వేస్తుంది.

ఈ యంత్రం ఫలం గాలి, చీడ, పీడ సమస్త ప్రయోగ దోషాలను హరించి, ఆరోగ్యం ప్రశాంతతను చేకూర్చును. విజయవంతంగా అభివృద్ధి పథంలో నడిపించును. నర ఘోష నుంచి మిమ్ముల్ని రక్షిస్తుంది.

ముఖ్యంగా నర ఘోషలో చిక్కుకుంటే మన అభివృద్ధికి అంతరాయం కలగడం ఖాయం. ఇటువంటి సందర్భంలో నరఘోష యంత్రం మీ చెంత వుంటే మంచి ఫలితాలను కలుగజేస్తుంది. ఈ యంత్రం చెడ్డ దృష్టి నుంచి మిమ్మల్ని కాపాడటానికి సహాయం చేస్తుంది.

ఇంటిలోనూ, వ్యాపార ప్రాంతంలోనూ ఈ యంత్రంను ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ యంత్ర ఫలితంగా వ్యాపార అభివృద్ధిని పెంచడానికి దోహదపడుతుంది.

అంతేకాక ప్రమాదాల నుంచి రక్షణగా ఉంటుంది.
మొత్తానికి నరఘోష యంత్రమును గృహంతో పాటు వ్యాపార స్థలం యందు ఉంటే సుఖ సౌఖ్యములు కలుగుతాయని చెప్పవచ్చు…….

 

” మీ దైనందిన ఆధ్యాత్మిక వ్యవహారాల కొరకు మన హరి ఓం యాప్ ని అందిస్తున్నాం .

మీ వ్యక్తిగత వివరముల బట్టి మీ సమస్యల పరిష్కారములకు, ముహూర్తములకు, మంచి రోజుల నిర్ణయములకు ప్రఖ్యాతి గాంచిన జ్యోతిష్యులచే జవాబులు అందిస్తాము.

ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Ome App డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచ్చితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

For More Updates Please Visit www.Hariome.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here