నక్షత్ర దోషాలకు పరిష్కారాలు | Nakshatra Dosha Remedies in Telugu

0
13949

5

అశ్వని –

రెమిడి – వాయువ్యం లో గుఱ్ఱపు బొమ్మ లొహం తో చేసినది పెట్టండి.

భరణి –

రెమిడి – ఏ పప్పుతో అయినా పంచదార వేసి ” పూర్ణం ” తయారు చేసి లక్ష్మీ దేవి కి నైవేద్యం పెట్టి తినాలి . భార్యకు తినిపించాలి.

కృత్తిక –

రెమిడి – తెల్లని పువ్వులు దేవాలయంలొ దానం ఇవ్వాలి. వేదజ్ఞుల ఆశీర్వాదం తీసుకోవాలి. కుల పురోహితుడి ఆశీర్వాదం తీసుకోవాలి .

రోహిణి –

రెమిడి – ఆవులకు ఆహారం తినిపించాలి.
తెల్లటి ఎద్దును శివాలయం లొ పుజించాలి. దానికి ఆహరం తినిపించాలి.

మృగశిర –

రెమిడి –
* అమ్మ వారికి యలుకులతో పుజ చేయించండి .
* అమ్మ వారి ఆలయం లొ ఎర్రని గావంచాలు దానం చేయండి .
* పళ్ళు ఆలయం లొ దానం చేయండి .
* సంగీతజ్ఞుల ఆశీర్వాదం తీసుకొండి.
* పోస్ట్ మాన్ కు బట్టలు పెట్టండి.

ఆర్ద్ర –

రెమిడి –
* జంతువధ నిరోధానికి తోడ్పడండి.
* రెండు పప్పు దినుసులు కలిసి ఆహారంగా ఉపయోగించండి.
* దొంగలని పట్టించండి. లేదా పట్టుకోవడానికి సహాయపడండి

పునర్వసు –

రెమిడి –
* మేలి రకం బియ్యం మీ ఊరిలో గాని దగ్గరలో గాని పడమర దిశగా ఉన్న శివాలయం లొ దానం ఇవ్వండి.

పుష్యమి –

రెమిడి –
* బార్లి, గొధుమలు, బియ్యం , చెరుకు వీటిలో ఏ వస్తువు అయినా సరే యజ్ఞాలు చేసే వారికి అయినా సత్ప్రవర్తన కలిగిన వారికి ఎవరికి అయినా శివాలయం లొ దానం ఇవ్వండి.

ఆశ్రేష –

రెమిడి –
* దుంప జాతి ఆహారాలను దానం ఇవ్వండి.
* పాము బొమ్మ చిన్నది సీసం తో చేయించి చెరువులొ లేదా నుతిలో లేదా నదిలో వేయండి .
* వైద్యులని సన్మానించండి .

మఖ –

రెమిడి –
* మాత,పితలను సేవించే వారిని వెతికి ఆశీర్వాదం పొందండి.
* కొండపై వెలసిన దైవ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకొండి.

పుబ్బ –

రెమిడి –
* నట, సంగీత ,కళాకారులను గౌరవించండి .
* తేనే దానం ఇవ్వండి.

ఉత్తర –

రెమిడి –
* ఉత్తమ ధాన్యము ను సత్ప్రవర్తన గలవారికి దానం చేయండి .

హస్త –

రెమిడి –
* వెండి ఏనుగు బొమ్మ లేక గణపతి విగ్రహం వేద పండితునికి దానం చేయండి.
* వేద పండితుల శిష్యరికం చేయండి.

చిత్త –

రెమిడి –
* యాలుకలు, కస్తూరి, లవంగాలు, పునుగు, జవ్వాది ఇవన్ని ఎర్ర వస్త్రం లొ కట్టి దానం ఇవ్వండి.
* చేనేత వస్త్రం నేసేవారికి బహుకరించండి.
* చనిపొయిన తరువాత నేత్ర దానం చేసేలా వీలునామా రాయండి.

స్వాతి –

రెమిడి –
* 2 కిలొల శనగ పప్పు దైవ ధ్యాసలో గడిపే వారికి దానం చేయండి .

విశాఖ –

రెమిడి –
* ఉత్తర దిశలొ పై మొక్కలు పెంచండి.
* శనగలు దానం ఇవ్వండి.

అనురాధ –

రెమిడి – బియ్యం , కొబ్బరి, ఖర్జూరం , బెల్లం ఇవన్ని మిశ్రమం తయారు చేసి దానం ఇవ్వండి.

జ్యేష్ట –

రెమిడి –

* కంచు పాత్రలో కర్పూరం వేసి సైనికునికి దానం చేయండి.

మూల –

రెమిడి –
* పేదలకి ఉచితం గా వైద్యం చేయడానికి ఆయుర్వేదిక్ వైద్యునికి మందుల డబ్బులు ఇచ్చిరండి.

పుర్వాషాడ –

రెమిడి –
* ఏనుగులకు అరటిపళ్ళు తినిపించడానికి మావటి వాళ్లకు ఇచ్చి దగ్గర ఉండి తినిపించండి.

శ్రవణం –

రెమిడి –
* శ్రీ వెంకటేశ్వర క్షేత్రానికి వెళ్లి విష్ణు దర్శనం , విష్ణు భక్తుల దర్శనం చేసుకు రండి.

ధనిష్ట –

రెమిడి –
* గొధుములు పుణ్యాత్ములకు శివాలయం లొ దానం చేయండి .

శతబిషం –

రెమిడి –
* కొంత మద్యాన్ని నీటిలో ప్రవహింప జేయండి .

పుర్వాబాధ్ర –

రెమిడి –
* కొంత నెయ్యి ఒంటరిగా జీవించే సత్పురుషులకి ఇచ్చి రండి.

ఉత్తరాబాధ్ర –

రెమిడి –
* కోవాను ప్రత్యేకం గా తయారు చేయించి 8 మంది ముసల బ్రాహ్మ్మనులకు శివాలయం లొ దానం ఇవ్వండి.

రేవతి –

రెమిడి –
* పద్మములు , సువాసన గల పుష్పాలు , యలుకులు, కస్తూరి , పునుగు , జువ్వాది ఇవన్ని ప్యాకింగ్ తయారు చేసి శివాలయం లొ దానం చేయండి .

ప్రతి నక్షత్రం లొ పుట్టిన జాతకుడు కొన్ని దానాలు చేయడం వలన ఆ జాతకుడి భవిష్యత్తు ఆనందకరం గా ఉంటుంది. అలాగే హొమాలు, జపాలు చేయించుకోవలసి ఉంటుంది. అవి చాలా ఖర్చుతో కూడుకొని ఉంటాయి .అలా చేయించుకోలేని వారి కోసం తంత్ర శాస్త్రం ప్రకారం ఈ పరిష్కారాలు చెప్పటం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here