
1. అమృత వాహిని క్షిప్రా నది | About River Kshipra in Telugu
మహాకాల శ్రీ శిప్రా గతిశ్చైవ సునిర్మలా
ఉజ్జయిన్యాం విశాలాక్షి వాసః కస్య న రోచతే
స్నానం కృత్వా నరోయస్తు మహాన్ ఘామహి దుర్లభం
మహాకాలం నమస్కృత్య నారో మృత్యుం న శోచతే|
మహాకాలుని భూమిలో ప్రవహించే శిప్రా (క్షిప్రానది) నిర్మలమైనది. స్వచ్చమైనది. ఉజ్జయిని విశాలాక్షి చల్లని చూపులు ప్రసరించే క్షిప్రానది లో స్నానమాచరించిన వారిని అప మృత్యువు ఎన్నడూ దరిచేరదు.
క్షిప్రానది ఎక్కడో కొండలనుంచీ గుహలనుంచీ జాలువారినది కాదు. ఈ నది నేలనుంచీ ఉద్భవించింది. ప్రజల జీవితాలలో ఆనంద ధారగా ప్రవహించింది. అందుకే క్షిప్రా నదిని లోక సరిత అంటారు. భారత దేశం లోని చాలా నదులు దక్షిణానికి ప్రవహిస్తాయి. కానీ క్షిప్రానది ఉత్తర గామి. క్షిప్రానది గొప్పదనం గురించి వేదాలలో కూడా చెప్పబడింది. మహాభారత రామాయణాలలో క్షిప్రా నది ప్రసక్తి వస్తుంది. స్కాంద పురాణం లో ఈ నది కి సంబంధించిన గాధ చెప్పబడింది.
Promoted Content