
1. భగవంతునికి హారతి ఎందుకు ఇస్తారు?
Significance Of Aarti – షోడశోపచారాలలో భాగంగా స్వామికి లేదా అమ్మవారికి దివ్యమంగళ నీరాజనాన్ని సమర్పిస్తారు. ఆ నీరాజన కాంతులలో భక్తులు భగవంతుడిని దర్శించుకోవాలని నీరాజనం ఉద్దేశ్యం.
స్నానపాన నైవేద్యాదులు ముగించుకొని స్వామి కొలువుతీరి ఉండగా ఆ దివ్య స్వరూపాన్ని కనులారా వీక్షించడానికి నీరాజనం ఇస్తారు.
పూర్వకాలం లో గర్భగుడిలో విద్యుద్దీపాలు ఉండేవి కాదు. కనుక దీపారాధన వెలుగులో కనిపించే స్వామిని మరింత ప్రకాశవంతంగా దర్శింపజేయడానికి నీరాజనం ఇస్తారు. ఈ ఉపచారం సమయాన్ని బట్టి, దేవతను బట్టి రకరకాలుగా ఉంటుంది.
ఏక హారతి, ద్విహారతి, పంచ హారతి, నక్షత్ర హారతి ఇలా అనేక రకాల హారతులు ఉంటాయి. సందర్భాన్ని బట్టి హారతి మారుతుంది.
Promoted Content
panthulu garu harathi isthe kallaki adhukokunda yela untam “manasa garu” 🙂 ?!