ఈరోజు- వరలక్ష్మి వ్రతం చేయువారు ఆచరించవలసిన నియమాలు ?

0
4491

 

లక్ష్మీదేవికి ఇష్టమైన మాసం శ్రావణ మాసం. ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించవచ్చు ఈ మాసంలో వచ్చే రెండవ శుక్రవారం లేదా పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీ వత్రం

ఈ కథను చదివిన వారికి, విన్నవారికి సకల కార్యాలూ సిద్ధిస్తాయి.

ఈ వ్రతం చేసుకోవాలనుకునే వారు ముందు రోజునే ఇల్లంతా శుభ్రంగా కడిగి, ముగ్గులు వేసి, గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి, గడపకు పసుపు, కుంకుమ అలంకరించుకోవాలి. ఇంటిలో ఈశాన్యమున రంగవల్లులు వేసి, మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి.

మండపంపైన వెండి లేదా కంచు, ఇత్తడి పళ్లెరాన్ని వుంచి అందులో బియ్యం పోసి దాని మీద వెండి, బంగారం లేదా కంచు, రాగి కలశాన్ని వుంచాలి. ఈ కలశంలో కొత్తచిగుళ్లు గల మర్రి లేదా ఇతర మొక్కల చిగుళ్లను వుంచాలి. కలశాన్ని గంధం, పసుపు, కుంకుమలతో అలంకరించుకోవాలి.

కలశంపై కొబ్బరికాయను వుంచి దానిని కొత్త రవికల గుడ్డతో అలంకరించుకోవాలి.

1. వరలక్ష్మి వ్రతం చేయి ఇంటి లో ఎవరు ఆ రోజు మద్యం, మాంసం సేవించరాదు . సిగరెట్ త్రాగకూడదు

2. రేపు కలశం తీసే ముందు ఒక ప్లేట్లో ఎరుపు రంగు నీరు పోసి , అందులో కర్పూరం పెట్టి హారతి వెలిగించి, అమ్మవారికి హారతి నిచ్చి, ఆ నీటి ని తులసి లో వేయాలి. తరువాత కలశం తీయాలి.

3. ఆ రోజు సాయంత్రం ఇంటి తలుపులు వేయకూడదు. తెరచి ఉంచాలి.

4. ఇంటి ముందు గుమ్మానికి వెనుక గుమ్మానికి లక్ష్మి దేవి అని భావించి పసుపు, కుంకుమ పెట్టి అలంకరించాలి.

5. వరలక్ష్మి వ్రతం చేసిన వారు మధ్యాహ్నం. విస్తరాకు లొనే భోజనం చేయాలి.

6. ఇంట్లో ఎవరికైనా మైల ఉంటే నైవేద్యం. వండి పెట్టకూడదు. కొబ్బరి కాయ కొట్ట కూడదు.

7. ఇంటిలో గొడవలు పడకూడదు.

8. వాడిన నూనె తో ప్రసాదం చేయరాదు.

9. డబ్బులు దండ అమ్మవారికి వేయకూడదు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here