సాయి బాబా బోధించిన గురుభక్తి | Sai Baba Bodha in Telugu

0
7100
f8c3adb9166321c548171fe02119724d
సాయి బాబా బోధించిన గురుభక్తి | Sai Baba Bodha in Telugu

సాయి బోధ / Sai Baba Bodha

సద్గురువైన సాయినాథుని కథలు అమూల్యమైనవి. ఆయన తన భక్తులకెప్పుడూ గురుభక్తిని గురించీ సన్మార్గమును గురించీ బోధించేవారు. సాయీ సచ్చరిత్రలోని 18-19 వ అధ్యాయాలలో రాధాబాయి అనే ఒక ముసలమ్మకు బాబా తన కథను వివరించే ఘట్టం సదాస్మరణీయమైనది.

4. రెండుకాసులు

కాని వారి మార్గము వారిది. వారు నా తల గొరిగించిరి; నానుండి రెండు పైసలు దక్షిణ యడిగిరి. నేను దానిని వెంటనే వారికి సమర్పించితిని. ’మీ గురువుగారు పూర్ణకాములయినచో వారు మిమ్ములను దక్షిణ యడుగనేల? వారు నిష్కాములని యెట్లనిపించుకొందురు? అని నీవడుగవచ్చును. దానికి సమాధనము నూటిగా చెప్పగలను. వారి డబ్బు లక్ష్యపెట్టేవారు కారు. ధనముతో వారు చేయున దేమున్నది? వారు కోరిన రెండు కాసులలో ఒకటి నిష్ఠ, రెండవది సంతోష స్థైర్యములతో గూడిన ఓరిమి! నేనీ రెంటినీ వారి కర్పించితిని. వారు ప్రసన్నులైరి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here