సాయి సచ్చరిత్ర పారాయణ నియమావళి

0
11888

saibaba

బాబా  కి సంబంధించిన రచనలన్నిటా సాయి సచ్చరిత్రే గొప్పది. సచ్చరిత్రను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు, బోధనలు, నీతుల్ని ఆకళింపు చేసుకోవడం. ఆకళింపు చేసుకుని మనల్ని మనం సంస్కరించుకోవడం. తన పట్ల పరిపూర్ణమైన శ్రద్ధనూ, విశ్వాసంతో కూడిన భక్తినే బాబా భక్తుల నుంచి ఆశిస్తారు. నిరంతరం తనని జపించే వారిని సప్తసముద్రాలూ దాటిస్తానని, వారి కష్టాలు కడతేరుస్తానని స్వయంగా బాబాయే చెప్పారు. అటువంటి బాబా సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించక తప్పదు.
పారాయణం ప్రారంభించే రోజు శుచిగా తలస్నానం చేయాలి.
పారాయణం చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. పారాయణకి ఆటంకం కలిగించే ఎలాంటి వస్తువుల్నీ (సెల్ ఫోన్, రేడియో వగైరా) దగ్గర ఉంచుకోకూడదు.
సచ్చరిత్ర పారాయణానికి కులమతాలు లేవు. వయో భేదాలు లేవు. లింగభేదం లేదు. ఎవరయినా దీనిని పారాయణం చేయొచ్చు.
కడతేరని సమస్యలతో బాధపడేవారు సాయి సచ్చరిత్రను వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఫలితం ఉంటుండు.
పారాయణాన్ని పొద్దున్నే ప్రారంభించాలి. ప్రత్యేక సంకల్పంతో పారాయణం చేయదలిస్తే ఆ వ్యక్తి పేరుపై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్కరోజులో పారాయణాన్ని పూర్తీ చేయాలి.
గురుపోర్నామి, విజయదశమి, శ్రీరామనవమి, దత్తజయంతి బాబాకి ఇష్టమయిన రోజులు. ఈ రోజుల్లో సచ్చరిత్ర పారాయణ చేయడం     అనుకూలిస్తుంది.
పారాయణానికి ముందు యథాశక్తి బాబాకి నైవేద్యం పెట్టాలి. అలాగే మనలోని అహంకారాన్ని, అసూయద్వేషాలను పక్కన పెట్టాలి.
బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్టించుకుని సచ్చరిత్రను పారాయణం చేస్తే అభీష్టాలు ఇట్టే నెరవేరుతాయి.
పారాయణం అనంతరం సచ్చరిత్రను దానం చేయాలి. వారి చేత కూడా సచ్చరిత్రను పారాయణం చేయించగలిగితే అంతకన్నా మించింది లేదు.


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here