
Do Not Make These Mistakes While Worshiping Lord Shani
1శని దేవుడి పూజ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి
హిందువులు చాలా మంది ఏళ్ళనాటి శని, అర్దాష్టమ శని ప్రభావంతో బాధపడుతుంటారు. శని దేవుడి ప్రభావం నుంచి ఊరటపొందడానికి శనీశ్వర ఆలయాలకు వెళ్తుంటారు. పురాణాల ప్రకారం శనిదేవుడిని కర్మ దేవుడిగా పూజిస్తారు. శనీశ్వరుడు తలుచుకుంటూ ఓడలు బళ్లు అవుతాయి, బళ్లు ఓడలు అవుతాయని భక్తుల నమ్మకం. మనం కర్మలను బట్టి ఆయన తగిన ఫలితాలు ఇస్తుంటారు. ఇందులో భాగంగానే కొందరు తమ జాతకంలో అనేక చెడు ప్రభావం కల్గి ఉంటారు.
దీని నుంచి ఉపశమనం పొందడానికి పూజారులు, పండితులను సంప్రదించి తమ భాధలు పోవడానికి వారు చేప్పే పరిహారాలను చేస్తుంటారు. కొందరు శనివారాల వ్రతం చేస్తుంటారు. మరికొందరు శనికి తైలాభిషేకం, నలుపురంగు బట్ట, నల్లని పదార్థాలను అర్పిస్తుంటారు. డబ్బులు ఉన్నవారు వస్త్రాలు, అన్నదానం, పురోహితులకు నవధాన్యాల దానంగా ఇచ్చి, తమ కష్టాలను, బాధలను తొలగించమని శనిదేవుడిని వేడుకుంటుంటారు. ఇలాంటి పరిహారాలు పాటించడం వలన శనిదేవుడు కొంత శాంతించి చెడు ప్రభావం నుంచి బయట పడేస్తాడుని భక్తులు విశ్వాసం. పరిహారాల కోసం తరువాతి పేజీలో చూడండి.