ఆది శంకర చరితం – 1 | Adi Shankaracharya Charitra Telugu

0
5116
adi shankaracharya
ఆది శంకర చరితం – 1 | Adi Shankaracharya Charitra Telugu

 Adi Shankaracharya Charitra Telugu

“శృతి స్మృతి పురాణానామలయం కరుణాలయం
నమామి భగవత్ పాదశంకరం లోక శంకరం”

మానవునికి మతం పై మక్కువ ఎక్కువ. మక్కువ మరికాస్త పెరిగితే అది ఆశయంగా మారుతుంది. ఆశయానికి ఆవేశం తోడైతే అది ఉద్యమం గా మారి హింసా మార్గం లో ప్రయాణం చేస్తుంది.

ఇట్టి ఆవేశ పరులే నేటి సమాజం లో మతం పేరిట హింస ను సృష్టిస్తున్నారు. మతం అనేది మానవుని శ్రేయస్సు కొరకు ఉపయోగపడాలి – వినాశనం కొరకు కాదు. భూమి ఒక్కటే అయిన నల్లమట్టి, ఎర్ర మట్టి, ఇసుక, బురద అనే భేదం ఉంది.

అదే విధంగా వర్షం రూపం లో పడిన నీరూ ఒకటే అయిన గంగ, కృష్ణ, గోదావరి, యమున, కావేరి మొదలగు నదులు గా భేదం కనిపిస్తోంది.

అదే విధంగా భగవంతుని పొందాలనుకొనే ప్రతి భక్తుని జ్జీవితమార్గం వేరైనా లక్ష్యం ఒకటే – దానికే మతం అని పేరు.

మతాన్ని ఏర్పరుచుకున్నది మనిషే కానీ, భగవంతుడు కాదు. దేవుడు పరుషుడు కాదు, స్త్రీ కాదు, అది ఒక తత్వం. ఈ తత్వానికి మతం కి సంబంధం లేదు.

భారతీయ తత్వం భగవంతుని కొరకై జీవించే విధానాన్ని మనకు భోదిస్తుంది. మతమనేది మనకు మంచితనాన్ని, మానవత్వాన్ని నేర్పాలి.

ఇతర మతాలను కించపరచడం, దుశ్చర్యలతో, మారణహోమం చేయడం మతాభిమానం అనిపించుకోదు.

మన భారతీయ సంప్రదాయంలో మతం అంటే “ధర్మం” మాత్రమే మనది సనాతన ధర్మం. “వేద ప్రమాణం” అను సూత్రాన్ని అనుసరించి మన ధర్మశాస్త్రాలు ప్రవర్తిస్తున్నాయి.

మనది ” హిందూ మతం” అనే మాట సరి అయినది కాదు. పాశ్చాత్యులు మనకు ఆ పేరు పెట్టారు. మనది వైదిక ధర్మం. వైదిక ధర్మం లో అన్ని మతాలు ఇమిడిపోతాయి. ” సర్వ్ జనాః సుఖినో భవంతు” అని వైదిక ఆశీస్సు.

ఇట్టి వైదిక ధర్మం కనుమరుగు అవుతున్నపుడు మహాత్ములు జన్మిస్తారు. వారి యొక్క జ్ఞ్యానం తో వైదిక ధర్మాన్ని పునరుద్దిస్తారు.

అట్టి మహనీయుడే “ ఆది శంకరాచార్యుడు“. కృష్ణ యజుర్వేదం లో సుప్రసిద్దమైన శ్రీ రుద్రాన్ని వ్యావహారికంగా “నమకం” అని పిలుస్తారు.

అందులో పరమేశ్వర రూపం కొన్నివేల రకాలుగా వర్ణించబడింది.”నమః కపర్దినే చ వ్యుప్తకేశవాయ చ” అని రుద్రవచనం. పరేమేశ్వరుడు జటాజుటము ధరించి ఉంటాడు, పూర్తిగా జుట్టు లేకుండా కూడా ఉంటాడుట. జటాజుటము గల రూపం మనకు సుప్రసిద్దమే.

కానీ గుండు ఉన్న రూపాన్ని మనం ఎప్పుడు చూడలేదు. భక్తులకి అట్టి రూపాన్ని కూడా చూపించడం కోసం పరమేశ్వరుడే సన్యాసి రూపంలో ఆది శంకరునిగా ఆవిర్భవించారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here