
షట్చక్రాలు | Shat Chakras in telugu
మూలాధారం గుదస్థానం, స్వాధిష్ఠానం తు మేహనం
నాభిస్తు మణి పూరాఖ్యం హృదయాబ్జ మనాహతమ్
తాలుమూలం విశుద్ధాఖ్యం ఆజ్ఞాఖ్యం నిటలాంబుజమ్
సహస్రారం భ్రహ్మరంధ్ర ఇత్యాగమ విదో విదుః
మన శరీరం లో అంతర్గతంగా ఏడు చక్రాలు ఉంటాయి. వాటిని పద్మాలని కూడా అంటారు. పైనున్న ఏడు లోకాలకు, మనశరేరం లోని సప్త ధాతువులకు ప్రతీకలు ఈ చక్రాలు. మానవ శరీరం ఈ సమస్త విశ్వాన్ని ప్రతిబింబిస్తుంది. ఒక్కో చక్రాన్ని ప్రేరేపించడం వల్ల ఆ రకమైన శక్తి మనలో మెల్కొంటుంది. షట్చక్రాలను మేల్కొల్ప గలిగిన నాడు మానవుడు దివ్యత్వాన్ని పొందుతాడు.
1. ఆధార చక్రము భూలోకాన్ని సూచిస్తుంది. ఇది పృథ్వీభూతస్థానం ఈ చక్రము ఆసన స్థానం లో ఉంటుంది.
2. స్వాధిష్ఠానచక్రం భువర్లోకాన్ని సూచిస్తుంది. ఇది జలభూతస్థానం ఈ చక్రము జననేంద్రియం వెనుక భాగాన, వెన్నెముకలో ఉంటుంది.
3. మణిపూరక చక్రం సువర్లోకాన్ని సూచిస్తుంది. ఇది అగ్నిభూతస్థానం ఈ చక్రము బొడ్డుకు మూలంలో వెన్నెముక యందు ఉంటుంది.
4. అనాహత చక్రము మహర్లోకాన్ని సూచిస్తుంది . ఇది వాయుభూతస్థానం. ఈ చక్రము హృదయం వెనుక వెన్నెముకలో ఉంటుంది.
5. విశుద్ధ చక్రం జనలోకాన్ని సూచిస్తుంది. ఇది ఆకాశభూతస్థానం. ఇది కంఠము యొక్క ముడియందుంటుంది.
6. ఆజ్ఞాచక్రం తపోలోకాన్ని సూచిస్తుంది. ఇది జీవాత్మస్థానం. ఇది రెండు కనుబొమ్మల మధ్యలో భ్రుకుటి స్థానంలో ఉంటుంది
7. సహస్రార చక్రం సత్యలోకాన్ని సూచిస్తుంది. ఇది ప్రమాతస్థానం. ఇది కపాలం పై భాగంలో మనం మాడు అని పిలిచే చోట ఉంటుంది.