
శూన్య ముద్ర వల్ల కలిగే లాభాలు.. వినికిడి సమస్యలనూ థైరాయిడ్ సమస్యలనూ నివారించే శూన్య ముద్ర | Shunya Mudra for Hearing and Thyroid Problems in Telugu
Shunya Mudra for Hearing and Thyroid Problems – శూన్య ముద్ర ద్వారా వినికిడి సమస్యలనూ, థైరాయిడ్ మరియు నరాల బలహీనతలనూ నయం చేయవచ్చు.
శూన్యం అంటే ఆకాశం. ఆకాశానికి ప్రతిరూపమైన మధ్యవేలుని, అగ్ని రూపమైన బొటనవేలుని ఒక దగ్గరికి చేసి వాటిలోని విద్యుత్ శక్తి కేంద్రకాలను ప్రేరేపించడం ద్వారా చెవిపోటు, చెవులో రొద, వినికిడి లోపాలు, నరాల బలహీనతలు తగ్గుతాయి.
అతి ముఖ్యమైన థైరాయిడ్ హార్మోన్లు శూన్య ముద్ర ద్వారా సరైన నిష్పత్తిలో ఉత్పత్తి అయ్యేలా చేయవచ్చు.
శూన్య ముద్ర ఎలా వేయాలి..?
- నిటారుగా నిలబడాలి,లేదా సుఖాసనం లో గానీ వజ్రాసనం లో గానీ నిటారుగా కూర్చోవాలి.
- చూపుడు వేలు పక్కన ఉన్న మధ్యవేలును వంచాలి.
- మధ్యవేలు చివరి భాగం బొటన వేలు మొదలును తాకేలా వంచాలి.
- మధ్యవేలు కదలకుండా బొటనవేలితో మెల్లిగా అదిమిపట్టాలి.
- మిగతా వేళ్ళు సాధ్యమైనంత నిటారుగా ఉంచాలి.
- ఈ ముద్రలో ప్రాణాయామం చాలా ఆరోగ్యకరం.