ప్రదక్షిణం దేనిగురించి చేస్తారు? ఇక్కడ పఠించివలసిన మంత్రము? ఎన్ని సార్లు ప్రదక్షిణ చేయాలి?

0
3006

Back

1. ప్రదక్షిణం దేనిగురించి చేస్తారు?

ప్రదక్షిణం చేయడం వల్ల పాపపరిహారం జరుగుతుంది. దేవాలయాలకు వెళితే ‘ గుడి చుట్టూ తిరగడం ప్రదక్షిణం’. మాములుగా ఇంట్లో దేవతారాధన చేస్తే చేయవలసినది ‘ఆత్మప్రదక్షిన’. తనంత తాను దక్షిణం (కుడి) నుండి తిరగడం, మనలో ఉన్న పరమాత్మను దర్శించేందుకు అది ఒక విధానం. గుడిలో ఆత్మప్రదక్షిణ పనికిరాదు.

గుడిని నిర్మించిన ఆగమ శాస్త్రానుసారం గుడి నలువైపులా వివిధ దేవతాశక్తులు ప్రతిష్టింపబడి ఉంటాయి. గుడి చుట్టూ తిరగడం వల్ల ఆ దేవతా శక్తుల అనుగ్రహ దృష్టి మనపై పడుతుంది. అంతే కాక – గుడిలో ప్రధాన దైవం – దీపం వలె విశ్వతోముఖుడు. అంటే అన్నివైపుల నుండి నమస్కరించడం కూడా – ఆలయ ప్రదక్షిణలో అంతరార్థం. సాధారణంగా దేవాలయంలో మూడు సార్లు ఆలయ ప్రదక్షిణ చేయాలి. మొక్కుబడులు ప్రకారం 11 – 108 మొదలైన సంఖ్యలు ఉంటాయి.

Back

Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here