Hanuman Chalisa Significance in Telugu | హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత

0
16797
hanuman chalisa
What is the significance of Hanuman Chalisa?

Hanuman Chalisa Significance

హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత

హనుమాన్ చాలీసా అంటే ఆత్మలకు భయం అని మరియు హనుమంతుడు అంటేనే ధైర్యానికి మారుపేరు అని తెలియచెప్పిన ఈ చాలీసా అత్యంత ప్రసిద్ధి చెందింది. అత్యంత శక్తివంతమైనది అని పిలువబడుతున్న ఈ హనుమాన్ చాలీసాను శ్రీరామచంద్ర భక్తుడు గొప్ప నైష్ఠిక భక్తుడు, తులసీదాస్ రచించారు. తులసీదాస్, రచించిన రచనలలో అత్యంత ఉత్తమమైనది, ముఖ్యమైనది తులసీ రామాయణము. హనుమాన్ చాలీసా ప్రాముఖ్యత ఏమిటి అనే ప్రశ్నకు వస్తే, చాలీసాలోని శ్లోకాలకు అర్థమేమిటి, దీనియొక్క శక్తివంతమైన మహిమ ఏమిటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాము. ఈ వ్యాసం హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియచెపుతుంది. దాదాపు హనుమాన్ చాలీసాలోని ప్రతి పదం అనేక రకాల ప్రయోజనాలతో ముడిపడి ఉంది. వివిధ శ్లోకాలను దోహాలుగా కూడా పిలుస్తారు. చాలీసాలోని కొన్ని ముఖ్యమైన శ్లోకాలను మరియు హనుమాన్ చాలీసా చదవటంవలన కలిగే మొత్తం ప్రయోజనాలను మనం ఇక్కడ పరిశీలిద్దాం.

హనుమాన్ చాలీసా యొక్క ప్రాముఖ్యత హనుమాన్ చాలీసాలోని ప్రారంభ దోహా “జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర ” వల్లే వెయటం వలన జీవితంలో స్వాభావిక దివ్య జ్ఞానాన్ని పొందుతారు. ఈ జ్ఞాన సహాయంతో, జీవితంలో ప్రతిష్టంభించిన అనేక సవాళ్లు, దాదాపు అసాధ్యం అనుకున్నవాటిని సాధించగలుగుతారు. మహావీర్ విక్రమార్కుడుతో మొదలయ్యే ‘మూడవ దోహా’ ప్రజలలో బలాన్ని నింపుతుంది మరియు అవాంఛనీయమైన సహవాస ప్రభావాలనుండి బయట పడడానికి సహాయపడుతుంది. చాలీసాలోని ఏడవ మరియు ఎనిమిదవ శ్లోకాలు, శ్రీరాముడి ఆత్మతత్వాన్ని అర్థం తెలియచేస్తాయి మరియు దేవుని దివ్యసన్నిధికి చేరువ చేస్తాయి.

14వ మరియు 15వ దోహాలు ఒక వ్యక్తి కీర్తిప్రతిష్టలు పొందటానికి సహాయం చేస్తాయి. మీ పనులు నిర్వహించడానికి కావలసిన సామర్థ్యం మరియు మీ సామర్త్యం పట్ల అందరి ప్రశంసలు అందుకుంటారు.

11వ ఛౌపయి చదవటం వలన పాములు మరియు విషజంతువుల భయం తొలగించడానికి సహాయం లభిస్తుంది.

16వ మరియు 17 ఛౌపయి చదవటం వలన జీవితంలో కోరుకున్న స్థానానికి ఎదగటానికి సహాయపడుతుంది. అది ఒక కార్యాలయంలో ప్రమోషన్లు కావొచ్చు లేదా ఉద్యోగానికి సంబంధించినది అయిఉండవచ్చు.

20వ దోహా చదవటం వలన జీవితంలో అనేక సవాళ్లను అధిగమించవొచ్చు మరియు అనేక అడ్డంకులు తొలగిపోయి లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుంది.

24వ ఛౌపయి, ముఖ్యమైనది, ఢాకిణి పిశాచాలు, భూతాలు మరియు చేతబడి ప్రభావాలు పడకుండా ఉండటానికి సహాయపడుతుంది. చాలీసాలోని ప్రతి దోహాతో ముడిపడి జీవులకు అనేక లాభాలు ఉన్నాయి. అందువలన హనుమాన్ చాలీసాకు గొప్ప ప్రాముఖ్యత ఉన్నది.

Related Posts

హనుమంతుడికి తమలపాకులతో పూజిస్తే కలిగే అద్భుత ఫలితాలు | Why Worship Anjaneya Swamy With Betel Leaves

హనుమన్ చాలీసాని పఠించేటప్పుడు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు | Hanuman Chalisa Chanting Rules

ప్రతి రోజు హనుమాన్ చాలీసా చదవడం వల్ల పొందే ప్రయోజనాలు | Benefits of Reciting the Hanuman Chalisa

Hanuman Chalisa in Telugu | హనుమాన్ చాలీసా

Hanuman Chalisa (Telugu Translation) | హనుమాన్ చాలీసా (తెలుగు అనువాదం)

హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu

Sri Apaduddharaka Hanumath Stotram – శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం

Pavamana Suktam Lyrics in Telugu | పవమాన సూక్తం

Sri Hanuman Mala Mantram Lyrics in Telugu | శ్రీ హనుమన్మాలా మంత్రం

Sri Hanuman Ashtakam Lyrics in Telugu | శ్రీ హనుమదష్టకం

Sri Hanumat Kavacham (Ananda Ramayane) Lyrics in Telugu – శ్రీ హనుమత్ కవచం (శ్రీమదానందరామాయణే)

Sri Hanuman Kavacham Lyrics in Telugu | శ్రీ హనుమత్ కవచం

Sri Yantrodharaka Hanuman Stotram Lyrics in Telugu – శ్రీ యంత్రోధారక హనుమత్ (ప్రాణదేవర) స్తోత్రం

Sri Ramadootha (Anjaneya) Stotram Lyrics in Telugu | శ్రీ రామదూత (ఆంజనేయ) స్తోత్రం

Karya Siddhi Hanuman Mantra Lyrics in Telugu | కార్యసిద్ధి శ్రీ హనుమాన్ మంత్రం

Bajrang Baan Lyrics in Telugu | బజరంగ్ బాణ్

Sri Anjaneya Stotram Lyrics in Telugu | శ్రీ ఆంజనేయ స్తోత్రం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here