Shani Trayodashi 2023 Dates in Telugu | శని త్రయోదశి ప్రాముఖ్యత, శని దోషాల విముక్తికై పాటించవలసిన నియమములు

0
16782
shani trayodashi 2023 in telugu
Shani Trayodashi Dates in 2023

Shani Trayodashi Significance in Telugu

శని త్రయోదశిని ఎప్పుడు జరుపుకుంటారు? When Shani Trayodashi Celebrate?

త్రయోదశి శనివారం నాడు వస్తే ఆ రోజును శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. శనివారం శ్రీమహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన రోజు. అలాగే త్రయోదశి పరమేశ్వరునికి ఇష్టమైన దినం.అందుకనే త్రయోదశి శనివారం నాడు వస్తే శివ కేశవులకు అత్యంత ప్రీతిపాత్రమైన దినమని పెద్దలు పేర్కొంటారు. శని జన్మించిన తిధి కూడా త్రయోదశి అందుకనే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. ఈ రోజున శనికి ప్రత్యేకమైన పూజలు చేస్తే శని దోషాలైన ఏలినాటి శని, అష్టమశని … తదితర దోషాల నుంచి విముక్తి లభిస్తుంది.శనివారం నాడు శ్రీమహాలక్ష్మీ, నారాయణుడు అశ్వత్థవృక్షంపై వుంటారని పురాణాలు పేర్కొంటున్నాయి. అందుకనే ఆ రోజున అశ్వత్థవృక్ష సందర్శన, ప్రదక్షిణ చేయాలి. శని త్రయోదశి రోజున సూర్యోదయానికి ముందే స్నానం చేసి నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయాలి. కాకికి నైవేద్యం పెట్టాలి. నల్లనువ్వులు, నువ్వుల నూనె, నల్లని వస్త్రంలో వుంచి దానం చేయాలి. శని బాధలు తీరేందుకు ఇలా స్తోత్రం చేయాలి.

ఈ శ్లోకాన్ని పఠిస్తే మంచిది (Shani Trayodashi Slokam)

‘‘ నీలాంజన సమాభాసం.. రవిపుత్రం యమాగ్రజమ్‌..

ఛాయా మార్తాండ సంభూతం.. తం నమామి శనైశ్చరమ్‌’’

పాటించవలసిన ముఖ్య నియమములు (Important Rules to Follow on Shani Trayodashi)

  • ఈరోజున ఉపవాసం ఉండడం మంచిది.
  • శని శాంతి పూజలు ఈ శనిత్రయోదశినాడు చేయించడం వలన అర్ధాష్టమ శని, ఏలినాటి శని వలన వచ్చే కష్టాలు తొలగుతాయి.
  • శనికి నువ్వులనూనెతో అభిషేకం చేయాలి.
  • నల్లని వస్త్రాలను ధరించడం దానం చేయడం రెండూ మంచిదే.
  • కొన్ని నల్లనువ్వులు, కొద్దిగా నువ్వులనూనె, ఒక గుప్పెడు బొగ్గులు, ఏడంగుళాల నల్లని రిబ్బను, ఎనిమిది ఇనుప చీలలు/మేకులు(nails), కొన్ని నవధాన్యాలు బ్రాహ్మడికి దానం ఇవ్వాలి. లేదా పారే నదిలో విడిచిపెట్టాలి.
  • కాకికి ఆహారాన్ని పెట్టాలి. ఆకలితో ఉన్నవారికి, వికలాంగులకు అన్నదానం చెయ్యాలి.
  • శని త్రయోదశినాడు నూనె గానీ, గొడుగు కానీ, నువ్వులను, నవధాన్యాలను కానీ కొనరాదు.

Shani Trayodashi Dates in 2023

Shani Krishna Pradosha Vrat in February

on Saturday, February 18, 2023
Pradosha Puja Muhurat – 06:14 PM to 08:02 PM
Duration – 01 Hour 48 Mins
Day Pradosha Time – 06:14 PM to 08:47 PM
Trayodashi Tithi Begins – 11:36 PM on Feb 17, 2023
Trayodashi Tithi Ends – 08:02 PM on Feb 18, 2023

Shani Shukla Pradosha Vrat in March

Shani Shukla Pradosha Vrat on Saturday, March 4, 2023
Pradosha Puja Muhurat – 06:23 PM to 08:51 PM
Duration – 02 Hours 28 Mins
Day Pradosha Time – 06:23 PM to 08:51 PM
Trayodashi Tithi Begins – 11:43 AM on Mar 04, 2023
Trayodashi Tithi Ends – 02:07 PM on Mar 05, 2023

Shani Shukla Pradosha Vrat in July

on Saturday, July 1, 2023
Pradosha Puja Muhurat – 07:24 PM to 09:24 PM
Duration – 02 Hours 01 Min
Day Pradosha Time – 07:24 PM to 09:24 PM
Trayodashi Tithi Begins – 01:16 AM on Jul 01, 2023
Trayodashi Tithi Ends – 11:07 PM on Jul 01, 2023

Shani Graha Stotras & Hymns

Shani Trayodashi 2023 Dates in Telugu | శని త్రయోదశి ప్రాముఖ్యత, శని దోషాల విముక్తికై పాటించవలసిన నియమములు

శ్లోకాలతో శనిదోష నివారణ చేసే ఉపాయం – Remedies for Shani Dosha

Sri Shani Ashtottara Satanamavali

శ్రీ శని స్తోత్రం – Sri Shani Stotram (Dasaratha Kritam)

Shani Jayanti

Shani Trayodashi 2023 in English | What is the Importance of Shani Trayodashi ?

శని దోషం మిమ్మల్ని బాధించకుండా ఉండాలంటే ఏమి చేయాలి..? | How to Prevent Shani Dosa Telugu?

శనీశ్వరుని కి నువ్వుల నూనె తొ దీపం ఎలా వెలిగించాలి? | Why to Light a Lamp for lord Shani With Sesame Oil in Telugu

శని గ్రహం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ..? | Shani graha Health Remedies in telugu

శని దోషం నివారణకు శాంతులు | Shani Dosha Nivarana Santhi Pooja in Telugu

ఏలినాటి శని గ్రహ దోష శాంతి కి నివారణ ఎలా ? | Elinati Shani Dosha Remedy Telugu

ఏలినాటి శనిగ్రహ ప్రభావం తొలగిపోయి, సుఖసంతోషాలను పొందే మార్గం కోసం | Elinati Shani Remedies in Telugu

శని గ్రహం కారణంగా ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు ..? | Shani graha Health Remedies in telugu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here