
Simhachalam Appanna Varshika Kalyanotsavam
సింహచలం అప్పన్న వార్షిక కళ్యాణోత్సవం
ఆంధ్ర ప్రదేశ్లో ప్రముఖ పుణ్య క్షేత్రం అయిన సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీ నృసింహస్వామి ఆలయంలో ఉగది వేడుకలు చాల ఘనంగా జరిగాయి. దేవాలయాన్ని శోభాయమానంగా తీర్చిదిద్ది తర్వాత గంగధార నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలంతో అభిషేకం చేసిన అనంతరం ప్రత్యేకంగా తయారు చేసిన ఉగాది పచ్చడిని స్వామికి నివేదించనున్నారు. తర్వాత భక్తులకు స్వామి దర్శనంకి అనుమతించారు. ఉగాది పండుగ పురస్కరించుకోని పెద్ద ఎత్తున భక్తులు సింహాద్రినాధుడిని దర్శించుకున్నారు.
సింహాద్రినాథుడి వార్షిక కళ్యాణ మహోత్సవం
ఉగాది పర్వదినం నుంచి సింహాద్రినాథుడి పెళ్లి పనులు ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2న సింహాద్రినాథుడి వార్షిక కళ్యాణ మహోత్సవం జరగనున్నది. ఇందులో భాగంగానే బుధవారం సాయంత్రం ఉత్తర ద్వారం, రాజగోపురం, కల్యాణ వేదికల వద్ద పెళ్లిరాటలు వేశారు. భక్తులు సహకారంతో ఈ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఏడాదికి ఒక్కసారి మాత్రమే స్వామి పాదాలను సూర్యకిరణాలు తాకనుండగా ఈ అపురూపమైన ఘట్టాన్ని తిలకించేందుకు భక్తులు కూడా పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Related Posts
శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల