చందనోత్సవంకి సిద్దమైన సింహాద్రి అప్పన్న | Simhadri Appanna Chandanotsavam 2023

0
958
Simhadri Appanna Chandanotsavam
Simhadri Appanna Chandanotsavam 2023 Details

Simhadri Appanna Chandanotsavam 2023

1సింహాద్రి అప్పన్న చందనోత్సవం

సింహాద్రి అప్పన్న చందనోత్సవంకి ఆలయ అధికారులు సర్వం సిద్దం చేశారు. సింహాద్రి అప్పన్న నిజ రూప దర్శనం ఎన్నో జన్మల పుణ్య ఫలం అని భక్తుల నమ్మకం. నిజదర్శన భాగ్యంను సామాన్య ప్రజలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము అని ఈవో వేండ్ర త్రినాథరావు అన్నారు.

ఈ నెల 23న జరగబోయే చందనోత్సవంపై సింహాచలం దేవస్థానం కార్యాలయంలో ట్రస్ట్ బోర్డ్ సభ్యులు, వివిధ శాఖాధిపతుల తో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు.

1. పోలీసు శాక, రెవెన్యూ, మెడికల్ అండ్ హెల్త్, జి.వి.ఏం.సి., అర్.టి.సి ఇలా అన్ని శాఖల వారికి పలు సూచనలు చేశారు.
2. ఈసారి చందనోత్సవానికి లక్షకు పైగా భక్తులు రావొచ్చు అని ఒక అంచన. భక్తులందరికి అవసరమైన మంచినీరు, చలువ పందిళ్ళు, మజ్జిగ, చిన్న పిల్లలకు పాలు వంటి సదుపాయాలు కల్పిస్తున్నట్లు దేవస్థానం ట్రస్ట్ బోర్డ్, అధికారులు తెలిపారు.
3. స్వామివారి ప్రసాదం కూడ అందరికి దొరికేల చూస్తామని అన్నారు.
4. సింహగిరి పైన క్రింద 6కు పైగా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు.
5. వెహికల్ పార్కింగ్ పాత గోశాల దగ్గర, ఇటు అడవివరం దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది.
6. భక్తుల సౌకర్యార్థం క్ స్వచ్చంద సంస్థల సహకారాలు తీసుకుంటున్నట్లు ఈవో తెలిపారు..

Back