
1. వాత నాశక ముద్ర
గర్భ కోశ వ్యాధులను నయం చేసుకోడానికీ, హృదయ సంబంధ మైన వ్యాధుల కొరకూ వేలకు వేలు ధనాన్ని ఖర్చుచేస్తుంటాం. ప్రాచీన ముద్రా శాస్త్రం లోని ఒక ముద్ర ద్వారా శరీరం లోని వాత సంబంధమైన వ్యాధులనూ, గర్భ కోశానికి సంబంధించిన మరియు హృదయ సంబంధమైన వ్యాధులనూ నివారించి శరీరం లోని శక్తిని ప్రేరేపించవచ్చు. నరాల బలహీనతలనుండి విముక్తి పొంది స్పష్టమైన కనుచూపును తిరిగి సాధించవచ్చు. ఆ ముద్ర పేరు గరుడ ముద్ర. మహావిష్ణుని వాహనమైన గరుడ ముద్రను వాత నాశక ముద్ర అని కూడా అంటారు. ప్రతిరోజూ ధ్యాన సమయం లో భాగంగా గరుడ ముద్రను సాధన చేయడం ద్వారా పై లాభాలన్నింటినీ పొందవచ్చు.
Promoted Content