Sindhuvara Patram
సింధువార పత్రం
హేరంబాయనమః సింధువారపత్రం సమర్పయామి
Sindhuvara Patram. దీనికి తెలుగున వావిలి, సంస్కృతమున శేఫాలినిర్గుండి. శాస్త్రీయ నామము (vitex negundo), ఇది పూవుల వర్ణముతో తెలుపు, నలుపు అని రెండు రకములు. నల్లవావిలి స్వర్ణక్రియలో ఉపయోగపడుతుందని రసవాదులు చెప్తారు. “వాతరోగానికి వావిలి” అని నానుడి కలదు. ప్రాకృత భాషలో కల “హరమేఖల’ అనే గ్రంధమున నిర్గుండి నివర్ఘ్యముగ (శరీర కాంతిని పెంచేదిగా) చెప్పబడినది.
దీని ఆకు ధూపము వేస్తే దోమలు పోతాయీ.
Patram Related Posts: