ఆరోగ్యానికి ఆరు | Six Healthy Habits in Telugu

1
6071
ఆరోగ్యానికి ఆరు | Six Healthy Habits in Telugu

ఆరోగ్యమంటే ఎక్కడో ఉండదు. తినే ఆహారం, వ్యాయామం, జీవనశైలి ఇవే మన ఆరోగ్య విధాతలు. మన అలవాట్లే కాక ఆలోచనలు, ఊహలు కూడా ఆరోగ్యాన్ని ఎంతో ప్రభావితం చేస్తాయి. అలాంటి కొన్ని మంచి జీవన సూత్రాలు…

 

  1. ఆన్నీ ఇష్టంగా, తృప్తిగా తింటున్నానన్న అనుభూతితో మీకిష్టమైన వాళ్లతో కలిసి ఒక పద్ధతిగా తినండి. మరీ ఇష్టంగా జీవించండి. ఎక్కువగా నీరు తాగండి.
  2. అంతర్గత అవయవాలను శుభ్రం చేసుకోండి. వీలైతే ప్రతి నెలలో ఒక రోజును పూర్తిగా పళ్లు తినటానికి మాత్రమే కేటాయించడం.ఆ రోజును “FRUITS DAY” గా పరిగణంచండి.
  3. ‘గాలి వార్తలను వినటం కంటే ‘గాలి’నే ఎక్కువగా తినండి, తాగండి, పీల్చండి. స్వచ్ఛమైన గాలిని పీల్చుకోండి. ప్రతి శ్వాసలోనూ మీ మనసు, శరీరంలోని ప్రతి ఆవయవం ఆరోగ్యంతో ఉన్నట్టు భావించండి. మిమ్మల్ని మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ప్రకటించుకోండి. ఉద్రేకాలకు లోనుకారండి. ఉత్సాహంగా జీవించండి.
  4. జీవితంలో ఎదురయ్యే ప్రతి అనుభవంనుండి, సన్నివేశం నుండి, వరంగా ప్రసాదింపబడ్డ ప్రకృతి నుండి కావలసినంత తృప్తినీ, సంతృప్తినీ దోచుకోండి, దాచుకోండి. దానం చేయండి, ఎక్కడో మీలో పుష్కలంగా దాగున్న మానసిక బలానికి సానపట్టండి. సద్వినియోగం చేసుకోండి. ‘మందు’ Medicines. మారుపేరే మనోధైర్యం. అందుకే దీనితో శారీరక, మానసిక లోపాలను సవరించుకొండి.
  5. చంద్రునిలోని ప్రశాంతతను, వెన్నెలలోని చల్లదనాన్ని తన్మయత్వంలోని ఆనందాన్ని మీ వదనంలో ప్రతిక్షణం ప్రదర్శించండి.
  6. వ్యక్తిత్వం నిలుపుకొండి, మానవత్వాన్ని మరచిపోకండి, ఎదుటి వ్యక్తుల్ని గౌరవించటం విధిగా పాటించండి. సరళమైన, ఆందరికి ఆమోదయోగ్యమైన ఆలోచనలతో ‘అతి’ జోలికి పోకుండా ఆనందంతో పాటు మనశ్శాంతిని అనుక్షణం అనుభవించండి.
  7. విశ్వాసం, నమ్మకం, అనే ఈ రెండింటికీ అమృతాన్ని విషాన్ని తారుమారు చేయగల శక్తి గలవి. ఈ శక్తిని యోగాభ్యాసం, ప్రాణాయామం ద్వారా మీ ఆధీనంలోకి తెచ్చుకోండి. రెండు షష్టిపూర్తుల కాలం మనస్పూర్తిగా జీవించండి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here