శుక్రగ్రహ దోష నివారణకు | Shukra Graha Dosha Remedies in Telugu.

0
13457
solution-for-problems-of-venus
Shukra Graha Dosha Remedies in Telugu

Shukra Graha Dosha Remedies in Telugu 

(Venus) Shukra Graha Dosha Remedies in Telugu జాతకచక్రంలో శుక్రగ్రహ దోషం ఉన్నవారికి వివాహం తొందరగా కాక పోవటం,వివాహ విషయాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్ట పోవటం,వివాహం అయిన తరువాత దంపతుల మద్య విభేదాలు,వాహన సౌఖ్యత లేకపోవటం జరుగుతుంది.

శుక్రగ్రహ దోష నివారణకు కస్తూరి ని పూజా మందిరంలో ఉంచి పూజ చేసుకోవచ్చును.
ఎర్రటి జాకెట్టు గుడ్డలో ఉంచి బీరువాలోగాని,లాకర్లో గాని ఉంచిన డబ్బు వృధాగా ఖర్చు అవ్వదు.

ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు కస్తూరిని వెంట తీసుకొని వెళ్తే సమయం వృధా కాకుండా పనులు పూర్తవుతాయి.

కస్తూరి లోపల ఉండే పొడిని గంధంతోపాటు నుదుట ధరించిన నరదృష్టి ఉండదు.మరియు దృష్టి లోపాలు (కంటి లోపాలు )ఉండవు.

కస్తూరికి ఆంగ్ల నామమయిన మస్క్ సంస్కృత పదమయిన ముష్క (వృషణాలు) నుండి ఉద్భవించింది.

ఇది మగ కస్తూరి జింక యొక్క ఉదరము మరియు పురుషాంగాల మధ్యన ఉండే ఒక ప్రత్యేక గ్రంధి నుండి వెలువడే పరిమళము.

కస్తూరిని పొందటం కోసం ఈ గ్రంధి మొత్తాన్ని జింక శరీరం నుండి వేరు చేస్తారు. బాగా పెరిగిన, ఆరోగ్యకరమయిన గ్రంధిలో నలభై శాతం కస్తూరి ఉంటుంది.

ఈ గ్రంధిని బాగా ఎండపెట్టడం వలన అందులో దాగి ఉన్న ముదురు ఎరుపు రంగులో ఉండే కస్తూరి నలుపు రంగులోకి మారుతుంది. ఇలా మారినప్పుడు అది వాడకానికి సిద్ధమయినదని అర్థం.

ఇంతకీ ఈ మగ జింక కస్తూరిని ఆడ జింకను ఆకర్షించుకోవడానికి తయారుచేసుకుంటుందిట. ప్రత్యుత్పత్తి కాలంలో (మే – జూన్) ఎక్కువ శాతం కస్తూరిని తయారుచేస్తుంది అని శాస్త్రవేత్తలు చెప్పారు.

కస్తూరిలో ఆ స్వభావ సిద్ధమైన వాసనకు ప్రధాన కారణమైన ఆర్గానిక్ కాంపౌండు ముస్కోన్.
పూర్వ కాలంలో మరియు పురాణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది.

వాటిల్లో దీనిని అలంకారానికి, సుగంధ పరిమళానికి, ఆరోగ్యానికి, హోమాలకి రక రకాలుగా వాడినట్లు చెప్పబడింది.

కస్తూరిని శని, రాహు గ్రహాలకు; రోహిణి, మూల, భరణి నక్షత్రాలకు హోమద్రవ్యము క్రింద వాడవలెనని శ్రీ విష్ణుధర్మోత్తర పురాణంలో చెప్పబడింది.

అలానే మణిద్వీపంలో కస్తూరి మృగాలు సంచరిస్తూ నిత్యం పరిమళాలను వెదచల్లుతూ ఉంటాయి అని మణిద్వీప వర్ణన (దేవీ భాగవతం) లో కూడా ఉంది.

వాస్తవానికి కస్తూరి అనేది అత్యంత ఖరీదయిన జంతు ఉత్పత్తులలో ఒకటి.

ఆయుర్వేదములో కూడా కస్తూరి ప్రముఖ పాత్రని పోషిస్తోంది.  ఎలా అంటే:

 1. చాలా కాలంగా కస్తూరి మాత్రలను తమలపాకు రసంలో నూరి తేనెలో కలిపి జలుబుకి, దగ్గుకి ఔషధంగా వాడుతున్నారు.
 2. గర్భిణీ స్త్రీలకు కస్తూరిని ఎక్కువగా నొప్పులకి వాడతారు. వాతపు నొప్పులయితే తగ్గుతాయి, అదే పురిటి నొప్పులయితే కాన్పు జరుగుతుంది అని కస్తూరి రసం పట్టించేవారు.
 3. వాతానికి అద్భుతమయిన మందు కస్తూరి. అందుకనే దీనిని తాంబూలంలో కలిపి తింటారు.
 4. అజీర్ణం, కఫం, అతిసారం, అధికమయిన చెమట, బాలింత ఒంటి నొప్పులు, వాంతులు మొదలయినవాటికి ఇది పెట్టింది పేరు. తేనెతో కాని అల్లం రసంతో కాని పరగడపున పట్టిస్తారు.
 5. మనిషి చనిపోయే ముందు శరీరం చల్లబడితే సారంగ నాభి కస్తూరిని పట్టిస్తే వేడి పుంజుకుని (మరి వాతాన్ని తగ్గించడానికి వాడతారు అంటేనే తెలుస్తోంది కదా చల్లదనాన్ని తగ్గించి వేడిని పెంచుతుంది అని. మనిషి బ్రతుకుతాడని నమ్మిక.
 6. గుండె జబ్బులు, ఉబ్బసం, ఆస్తమా, మూర్థ, నరాల బలహీనత, ధనుర్వాతం, పక్షవాతం, మొదలయినవాటికి ఇది చక్కని మందు.
  ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి కానీ ముఖ్యమయినవి మాత్రం ఇక్కడ పెట్టాను. కస్తూరి శ్రేష్టతకి మారు పేరు అంటారు.
 7. కస్తూరి ఉన్న ఇంట్లో ధనాభివృద్ధి ఉంటుంది. రుణభాదలు ఉండవు.అధికారుల వేదింపులు ఉండవు.
 8. వైవాహిక జీవితంలో కలిగే ఇబ్బందులను తొలిగిస్తుంది.దంపతుల మద్య ఏటువంటి గొడవలు లేకుండా అన్యోన్యత కలిగి ఉంటారు.
 9. బిజినెస్ చేసే బీరవాలోగాని,గల్లా పెట్టెలోగాని ఉంచిన దనానికి లోటు ఉండదు.పూజా స్థలంలో ఉంచిన వ్యాపారాభివృద్ధి జరుగుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here