అయ్యప్ప దివ్య క్షేత్రం ” శ్రీ సోరి ముత్తు అయ్యనార్ కోవిల్” | Sorimuthu Ayyanar Temple History in Telugu

0
4558
ChoriMuthu_Ayyanar_Temple (2)
అయ్యప్ప దివ్య క్షేత్రం ” శ్రీ సోరి ముత్తు అయ్యనార్ కోవిల్” | Sorimuthu Ayyanar Temple History in Telugu

అయ్యప్ప దివ్య క్షేత్రం ” శ్రీ సోరి ముత్తు అయ్యనార్ కోవిల్” | Sorimuthu Ayyanar Temple History in Telugu

శ్రీ సోరి ముత్తు అయ్యనార్ కోవిల్  క్షేత్రం

తమిళనాడు లోని చెన్నై కు దగ్గరగా వున్న వలసరవక్కం (Valasaravakkam) లోని అయ్యప్ప దివ్య క్షేత్రాలలో ప్రప్రథమ దివ్య క్షేత్రం ” శ్రీ సోరి ముత్తు అయ్యనార్ కోవిల్”

కరయార్ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతంలో కరయార్ డ్యాం చెంత (పాపసాశనం,తిరునల్వేలి) కొలువై ఉన్నాడు “శ్రీ ధర్మశాస్తా” . యుద్ధ విద్యలు నేర్చుకొనుటకై స్వామి అయ్యప్ప ఇక్కడకు విచ్చేసారని కథనం.

అగస్త్య మహర్షి ఇక్కడ యజ్ఞం చేస్తుండగా అకస్మాత్తుగా మిరుమిట్లు గొలిపే దివ్య కాంతులతో
“కోటి సూర్య సమప్రభ ” అన్నట్లు “పూర్ణ పుష్కల మరియు తన పరివార సమేతుడై
“శ్రీ ధర్మశాస్తా ” ప్రత్యక్షం అయ్యారు . దేవతలంతా సంభ్రమాశ్చర్యాలతో,
ఈ దివ్య దర్శనానికి పులకించి “కనక పుష్ప” వర్షం ఆ ప్రాంతం అంతా కురిపించారు .

ఆవిదంగా “సోరి (సువర్ణ) ముత్తు” అనే పేరుతో పిలువబడుతున్నారు.
ఈకథనాన్ని బలపరిచే విధంగా ఇప్పటికీ ఆ ప్రాతంలో అప్పుడప్పుడూ బంగారు
రేకు ముక్కలు కనపడుతూనే ఉన్నాయి.

ఇక్కడ ప్రధాన అర్చామూర్తులు “మహా లింగం , పూర్ణ పుష్కల సమేత ధర్మశాస్తా” వీరితోపాటు ఆలయానికి కుడివైపున ” అగస్త్య ఋషి ,సంగిలి భూతనాథర్, బ్రహ్మ రాక్షసి, తలవై మదన్, థూసి మదన్, పట్టవరయర్, శుదలై మదన్, ఇరుప్పన్, ఇరుడన్, కరడి మదసామి, మొట్టయార్, పదల కందిగై, కుంబమని” మొదలైన 21 పరివారదేవతలు కొలువై ఉన్నారు.

కుండలినీ యోగం ప్రకారం ఈ క్షేత్రాన్ని “మూలాధారం” అని చెప్తారు. సాధకులకు ఈ క్షేత్ర దర్శనం కుండలినీ శక్తిని ఉద్దీపనం చేస్తుందని ,పాపకర్మను తొలగించి మన మనస్సును జయించగలిగే శక్తిని ప్రసాదిస్తుందని నమ్మకం.

ఇక్కడి చెట్టుకి గంటలు కట్టడం ఆచారం ,కట్టిన కొంతకాలానికి ఆ గంటలు చెట్టులోనికి
ఫలహారం మాదిరిగా వెల్లిపోవటం ఒక వింత. అలా చెట్టులోనికి తాము కట్టిన గంట వెల్లిపొతే
తమ కోరిక నెరవేరుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం

* సంగిలి భూతనాథర్

ఈయన శాస్తా పరివారంలో ముఖ్యుడు .ఈఆలయానికి రావటానికి ప్రజలు నది దాటి రావలసి వచ్చేది.
ఈయన ఒక ఇంజనీరు గారి భార్య ఒంటిమీదకు వచ్చి ఈ ప్రాంతంలో నదిని దాటటానికి ఒక వంతెన నిర్మిచవల్సిందిగా కోరాడు, ఫలితంగా వంతెన నిర్మానమై రాకపోకలు మరింత పెరిగినాయి .

* పట్టవరయాన్

వేరొక మండపంలో ఈయన కొలువై ఉన్నారు. ఇక్కడ ఒక వింత ఆచారం ఉంది.
ఎవరికైనా కాళ్ళు,మోకాళ్ళు నెప్పులు ఉంటే ఈయన ఆవరణలో ఒక కొత్త చెప్పుల జంట కడతారు. నెప్పులు తగ్గిన తర్వాత వచ్చి కట్లు విప్పి చూస్తే అవి పూర్తిగా అరిగిపోయి ఉంటాయి !

ప్రస్తుతం ఉన్న ఆలయాన్ని సింగంపట్టి జమిందార్లు పర్యవేక్షిస్తున్నారు .
ఆది తమిళ అమావాస్యకి (Jul-Aug) చివరి (Jan-Feb) అమాయాస్యకు వేలదిమంది జనం వస్తారు , ఉత్సవాలు జరుగుతాయి.ఇక్కడి బాణ తీర్థం చాల ప్రశస్తమైనది .

అయ్యప్ప భక్తులు తప్పక చూడవలసిన అద్భుతమైన మూలాధార ప్రేరణ పూర్వక అయ్యప్ప దివ్య క్షేత్రం.

” స్వామియే శరణం అయ్యప్ప ”

 

source

http://pawankumarv.blogspot.in/2014/12/must-visit-ayyappa-divya-kshetram-sri.htm

l

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here