South Central Railway Has Announced Special Trains From Secunderabad to Tirupati
దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ప్రత్యేక రైళ్లు
తిరుమల శ్రీవారి భక్తులకు భారతీయ రైల్వే శాఖ కొత్తగా ప్రత్యేక రైళ్ళను నడపనున్నట్లు ప్రకటించింది. ఈ రైళ్ళను సికింద్రాబాద్ నుండి తిరుపతి మధ్య నడవనున్నాయి. ఈ విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌లో ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి తిరుపతి మార్గంలో భక్తులు ఎక్కువగా ప్రయాణం కొనసాగించడం కారణంగా ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు రైల్వేశాఖ స్పష్టం చేసింది.
ప్రత్యేక రైళ్ల వివరాలు: (Details of Tirupati Special Trains)
1. సికింద్రాబాద్-తిరుపతి(రైల్ నెంబర్ 07489) 17, 24, 31వ (శుక్రవారం) తేదీలలో అందుబాటులో ఉండనుంది.
2. తిరుపతి-సికింద్రాబాద్(ట్రైన్ నెంబర్ 07490) 19, 26వ (ఆదివారం) తేదీలలో సర్వీసులు అందించనుంది.
ఇకపొతే, సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను కూడ సర్వీస్ పెంచబొతున్నట్టు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్-దానాపూర్(ట్రైన్ నెంబర్ 03226) మార్చి 19, 26వ తేదీలలో అందుబాటులో ఉంటుంది. ఆ రోజుల్లో ఉదయం 10 గం.కు సికింద్రాబాద్‌లో బయలుదేరి సాయంత్రం 7 గం.కు దానాపూర్ చేరుకుంటుంది.
దానాపూర్-సికింద్రాబాద్(03225) రైలు 16, 23వ తేదీలలో సర్వీసులు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఒక ప్రకటనలో పేర్కొంది. సాయంత్రం 8.50 గం.కు దానాపూర్‌లో బయలుదేరి మరసటి రోజు ఉదయం 4.40కి సికింద్రాబాద్‌కు చేరుకోనుంది.
ఈ రైల్లు కాజీపేట్, పెద్దపల్లి, రామగుండం, బెల్లంపల్లి, సిర్పూర్, కాగజ్‌నగర్‌తో పాటు పలు రైల్వే స్టేషన్లలో ఆగనున్నాయి. ఈ రైల్లలో సెకండ్ క్లాస్ కోచ్‌లతో పాటు స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉండనున్నాయి.
Related Posts
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఏప్రిల్ నెలలో ఈ సేవలు రద్దు…!
తిరుమల శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఎప్పుడు? ఆ రోజు ఏం చేస్తారు?
తిరుపతి దేవస్థానం మార్చి 1 నుంచి దర్శనం కోసం కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టనుంది
శ్రీవారి దర్శనం నిమిషాల్లోనే కొత్త రికార్డు..!! Tirumala Tirupati Devastanam
TTD Vaikunta Ekadasi Special Entry Tickets Released – తిరుమల వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల