పాలకూరలోని ఆరోగ్య ప్రయోజనాలు | Health Benefits of Spinach in Telugu

1
12915
Spinach-leaves
పాలకూరలోని ఆరోగ్య ప్రయోజనాలు | Health Benefits of Spinach in Telugu

ఎముకల ఆరోగ్యానికి తోడ్పడే విటమిన్ కె పాలకూరలో లభించినంత మరే కూరగాయల్లోనూ ఉండదు!

పాలకూర పోషకాల గని. దీనిలో ఇనుము దండిగా ఉంటుంది.

శరీరంలోని అన్ని భాగాలకు ఆక్సిజన్‌ను సరఫరా చేసే ఎర్ర రక్తకణాల పనితీరులో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి12, ఫోలిక్‌యాసిడ్, మాంగనీసు, మెగ్నీషియం కూడా ఇందులో ఉంటాయి.

పాలకూర లో పోలేట్‌, అమినోఆస్సి ఎక్కువ. రక్తంలో హోమొసిస్టన్‌ మోూతాదు పెగడం వల్ల గుండెరక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాం ఉంది. దీనివల్ల కూడా శృంగార సమస్యలు తలెత్తుతాయి.

అయితే పాలకూర తినడం వల్ల ఈ సముస్య తగ్గుతుంది. శృంగారానికి మార్గం సుగముం అవుతుంది.

పాలకూరకు క్రమంగా తింటే వయసుతో పాటు వచ్చే మతిమరుపును రానవ్వకుండా తోడ్పడుతుంది. పాలకూరలో లభించే విటమిన్ సీ, ఏ లు మెగ్నీషియం, పోలిక్ యాసిడ్లు క్యాన్సర్ ను నివారిచడంలో తోడ్పడుతాయి.

ముఖ్యంగా ఊపిరితిత్తులు, బ్రెడ్ క్యాన్సర్ ను అదుపు చేయడంలో ఇవి ప్రముఖ పాత్ర పోషిస్తాయి. గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటాయి.

పాలకూరను ఆహారంలో ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. శరీరానికి అవసరమైన ఇనుము పుష్కలంగా ఉండే పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది

మెగ్నీషయం కు పాలకూర మంచి అధారము . ఆస్త్మా లక్షణాలను తగ్గించడము లో బాగా సహకరిస్తుంది. ఆస్తమా గలవారికి రక్తము లోనూ , టిష్యూలలోను మెగ్నీషియము స్థాయిలు తక్కువగా ఉంటాయి.

దీర్ఘకాలము మెగ్నీషియం స్థాయిలు పెంచుకోవడము వలన ఆస్త్మా ఎటాక్స్ తగ్గుతాయి

పక్షవాతం వచ్చే రిస్క్ ను నివారించే విషయం లో పాలకూర సమర్ధవంతం గా పనిచేస్తుందని చైనీస్ శాస్త్రవేత్తలు నిరూపించారు.

పాలకూర,పైన్ ఆపిల్,డ్రై ఫ్రుట్స్ వంటి వాటిని ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది.హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

అలానే ఫోలిక్ యాసిడ్ అందే ఆహారం తీసుకుంటే విటమిన్ బి సమృద్ధిగా శరీరానికి అందుతుంది. అది ఎర్రరక్తకణాల వృద్ధికి దోహదం చేస్తుంది.ఆ లోపాన్ని త్వరగా దూరం చేస్తుంది

పాలకూర  లో విటమిన్‌ ఎ, బీటా కెరాటిన్‌లు వయసు ఛాయలు రాకుండా చర్మాన్ని కాపాడతాయి. ఇవి పాలకూరలో పుష్కలంగా ఉంటాయి.

దీనిని రోజూ ఆహారంలో తీసుకుంటే నలభైలలో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here