Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja in Telugu | శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ

0
331
Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja Lyrics in Telugu
Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja Lyrics With Meaning in Telugu PDF

Sri Anjaneya (Hanuman) Shodasopachara Puja Lyrics in Telugu

1శ్రీ ఆంజనేయ షోడశోపచార పూజ

శ్రీ గణపతి పూజ (పసుపు గణపతి పూజ) చూ. ||

పునః సంకల్పం –
పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ మమ సంకల్పిత మనోవాంఛాఫల సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీమదాంజనేయ స్వామి దేవతా ప్రీత్యర్థం యథాశక్తి షోడశోపచార పూజాం కరిష్యే ||

ధ్యానం –
అతులితబలధామం స్వర్ణశైలాభదేహం
దనుజవనకృశానుం జ్ఞానినామగ్రగణ్యమ్ |
సకలగుణనిధానం వానరాణామధీశం
రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి ||
గోష్పదీకృతవారీశం మశకీకృతరాక్షసమ్ |
రామాయణమహామాలారత్నం వందేఽనిలాత్మజమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః ధ్యాయామి ||

ఆవాహనం –
రామచంద్రపదాంభోజయుగళ స్థిరమాసనమ్ |
ఆవాహయామి వరదం హనూమంతమభీష్టదమ్ ||
ఓం శ్రీ హనుమతే నమః ఆవాహయామి |

ఆసనం –
నవరత్ననిబద్ధాశ్రం చతురశ్రం సుశోభనమ్ |
సౌవర్ణమాసనం తుభ్యం దాస్యామి కపినాయక ||
ఓం శ్రీ హనుమతే నమః సింహాసనం సమర్పయామి |

పాద్యం –
సువర్ణకలశానీతం గంగాది సలిలైర్యుతమ్ |
పాదయోః పాద్యమనఘం ప్రతిగృహ్య ప్రసీద మే ||
ఓం శ్రీ హనుమతే నమః పాదయోః పాద్యం సమర్పయామి |

అర్ఘ్యం –
లక్ష్మణప్రాణసంరక్ష సీతాశోకవినాశన |
గృహాణార్ఘ్యం మయా దత్తం అంజనాప్రియనందన ||
ఓం శ్రీ హనుమతే నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి |

ఆచమనీయం –
వాలాగ్రసేతుబంధాయ శతాననవధాయ చ |
తుభ్యమాచమనం దత్తం ప్రతిగృహ్ణీష్వ మారుతే ||
ఓం శ్రీ హనుమతే నమః ముఖే ఆచమనీయం సమర్పయామి |

మధుపర్కం –
అర్జునధ్వజసంవాస దశాననమదాపహ |
మధుపర్కం ప్రదాస్యామి హనుమన్ ప్రతిగృహ్యతామ్ ||
ఓం శ్రీ హనుమతే నమః మధుపర్కం సమర్పయామి |

స్నానం –
గంగాదిసర్వతీర్థేభ్యః సమానీతైర్నవోదకైః |
భవంతం స్నపయిష్యామి కపినాయక గృహ్యతామ్ ||
ఓం శ్రీ హనుమతే నమః శుద్ధోదక స్నానం సమర్పయామి |
స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి |

వస్త్రం –
పీతాంబరమిదం తుభ్యం తప్తహాటకసన్నిభమ్ |
దాస్యామి వానరశ్రేష్ఠ సంగృహాణ నమోఽస్తు తే ||
ఉత్తరీయం తు దాస్యామి సంసారోత్తారకారణ |
గృహాణ చ మయా ప్రీత్యా దత్తం ధత్స్వ యథావిధి ||
ఓం శ్రీ హనుమతే నమః వస్త్రయుగ్మం సమర్పయామి |

యజ్ఞోపవీతం –
నవభిస్తంతుభిర్యుక్తం త్రిగుణం దేవతామయమ్ |
ఉపవీతం చోత్తరీయం గృహాణ రామకింకర ||
ఓం శ్రీ హనుమతే నమః యజ్ఞోపవీతం సమర్పయామి |

గంధం –
కస్తూరీకుంకుమామిశ్రం కర్పూరాగరువాసితమ్ |
శ్రీచందనం తు దాస్యామి గృహ్యతాం హనుమత్ప్రభో ||
ఓం శ్రీ హనుమతే నమః దివ్య శ్రీచందనం సమర్పయామి |

ఆభరణం –
భూషణాని మహార్హాణి కిరీటప్రముఖాన్యహమ్ |
తుభ్యం దాస్యామి సర్వేశ గృహాణ కపినాయక |
ఓం శ్రీ హనుమతే నమః సర్వాభరణాని సమర్పయామి |

అక్షతాన్ –
శాలీయానక్షతాన్ రమ్యాన్ పద్మరాగసమప్రభాన్ |
అఖండాన్ ఖండితధ్వాంత స్వీకురుష్వ దయానిధే ||
ఓం శ్రీ హనుమతే నమః అక్షతాన్ సమర్పయామి ||

పుష్పాణి –
సుగంధీని సురూపాణి వన్యాని వివిధాని చ |
చంపకాదీని పుష్పాణి కమలాన్యుత్పలాని చ ||
తులసీదళ బిల్వాని మనసా కల్పితాని చ |
గృహాణ హనుమద్దేవ ప్రణతోఽస్మి పదాంబుజే ||
ఓం శ్రీ హనుమతే నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి |

అథ అంగపూజా –
ఓం మారుతయే నమః – పాదౌ పూజయామి |
ఓం సుగ్రీవసఖాయ నమః – గుల్ఫౌ పూజయామి |
ఓం అంగదమిత్రాయ నమః – జంఘే పూజయామి |
ఓం రామదాసాయ నమః – ఊరూ పూజయామి |
ఓం అక్షఘ్నాయ నమః – కటిం పూజయామి |
ఓం లంకాదహనాయ నమః – వాలం పూజయామి |
ఓం సంజీవననగాహర్త్రే నమః – స్కంధౌ పూజయామి |
ఓం సౌమిత్రిప్రాణదాత్రే నమః – వక్షఃస్థలం పూజయామి |
ఓం కుంఠితదశకంఠాయ నమః – కంఠం పూజయామి |
ఓం రామాభిషేకకారిణే నమః – హస్తౌ పూజయామి |
ఓం మంత్రరచితరామాయణాయ నమః – వక్త్రం పూజయామి |
ఓం ప్రసన్నవదనాయ నమః – వదనం పూజయామి |
ఓం పింగళనేత్రాయ నమః – నేత్రౌ పూజయామి |
ఓం శ్రుతిపరాయణాయ నమః – శ్రోత్రే పూజయామి |
ఓం ఊర్ధ్వపుండ్రధారిణే నమః – లలాటం పూజయామి |
ఓం మణికంఠమాలికాయ నమః – శిరః పూజయామి |
ఓం సర్వాభీష్టప్రదాయ నమః – సర్వాణ్యంగని పూజయామి |

మిగతా స్తోత్రం కోసం తరువాతి పేజీలోకి వెళ్ళండి.

Back