శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ | Dasara Second Goddess in Telugu

1
12514

Dasara Second Goddess in Telugu

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

1. శ్రీ బాలాత్రిపుర సుందరీ దేవి అలంకరణ

27/09/2022 – మంగళవారం

ఆశ్వయుజ శుద్ధ విదియ,

రెండవ రోజు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకరణ (బుధుడు +కేతువు)

పసుపుచీర (గురువు)

పంచదార నివేదన (శుక్రుడు + చంద్రుడు)

దధ్యన్నము

2. ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌఃక్లీం కళాంబిభ్రతీం
సౌవర్ణాంబర ధారిణీం వరసుధాదౌతాం త్రినేత్రోజ్జ్వలాం
వందే పుస్తక పాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్జ్వలాం
తాంగౌరీం త్రిపురాం పరాత్పర కళాంశ్రీచక్ర సంచారిణీమ్

Hreemkaaraasana garbhitaanala sikhaam sou kleem kalaam bhibhratheem
souvarnaambara dhaareem ,varasudhaadouthaam trinetrojjvalaam
vamde pusthaka paasamamkusadharaam sragbhushithaamujvalaam
thaamgoureem tripuraam paraatpara kalaam sreechakra samchaarineem .

రెండవరోజు అమ్మవారికి శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణ చేసి పసుపు రంగు చీరను సమర్పించి, పంచదార లేదా పాయసాన్నమును, దధ్యన్నమును నైవేధ్యముగా నివేదన చేయడము ద్వారా జాతకములోని బుదుడి యొక్క దోషము పోయి జ్ఞానము పెరుగుతుంది, విధ్యలో ఆటంకాలు తొలగి అబివృద్దిని సాధిస్తారు.

పోటీ పరీక్షలలో తరచుగా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్న వారు వాటిని అధిగమిస్తారు.
ఆస్తుల వ్యవహారములలో వివాదములున్నవారికి వాటి నుండి విముక్తి లభిస్తుంది.
ఆరోగ్య పరంగా నరములు లేదా తీవ్రమైన చర్మ సంభదిత సమస్యలున్న వారికి ఆయా సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. బందువులతో ఉన్న మస్పర్ధలు సమసిపోతాయి.
చేయు వ్యాపారముల లో సమస్యలు తొలగి అభివృద్దిని సాధిస్తారు.

అన్నింటికి మించి దైవ లేదా రహస్య శాస్త్ర ఉపాసనలో ఉన్న వారు ఈ సమయంలో అమ్మవారిని సశాస్త్రీయంగా పూజించి ప్రసాదములు నివేదన చేసి ఆయా మంత్రములను అనుష్టానము/జపం /ఉపాసన చేయడము ద్వారా అత్యద్బుతమైన, అశ్చ్యర్యకరమైన ఫలితములు వస్తాయి అనడములో ఎటువంటి సందేహము లేదు .

అలాగే గురువులనుండి ఏదన్నా మంత్రమోపదేశమును పొందినవారు ఈ రోజు అమ్మవారిని పూజించి ఆయా మంత్రములను జపించుట వలన మంచి ఫలితములను పొందు అవకాశము కలదు.

అవకాశము ఉన్న వారు ఈ రోజు 10 సంవత్సరముల లోపు బాలిక (ల) ను అమ్మవారిగా భావన చేసి వారికి క్రొత్త వస్త్రములను దానంగా ఇవ్వడము వలన అత్యద్బుతమైన ఫలితములను చూడగలరు.
(అయితే ఆ వస్త్రములను నిజం గా అవసరం ఉన్న వారిని గుర్తించి ఇవ్వగల్గీతే ఇంకా మంచిది.)

3. పటించవలసిన మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం బాలా త్రిపుర సుందర్యైనమోనమః అనే మంత్రాన్ని 5వేల మార్లు లేదా కనీసము 108 మార్లు జపించాలి

om im hreem sreem baalaa Tripura sumdaryai namo namaha

అవకాశము ఉన్న వారు శ్రీ లలితా త్రిశతి స్త్రోత్రము లేదా, శ్రీ త్రిపుర సుందరి స్త్రోత్రమును స్మరించ వచ్చును.

శ్రీ గాయత్రి దేవి అమ్మవారు అలంకరణ | Dasara third day Goddess in Telugu

రాఘవేంద్ర .ఏం.ఏ . జ్యోతిష్యం .స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

1 COMMENT

  1. ఇంటి ముఖద్వారం పంచాంగం లో పేరు లోని మొదటి ఆక్షరం ఆధారంగా అంటారు.కానీ మీరు రాశి ఆధారంగా అని రాసారు ఏది కరెక్ట్?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here