శ్రీ లలిత దేవి

4
11159

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

1. శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి

13-10-2018 – శనివారం
ఆశ్వయుజ శుద్ధ పంచమి
నాల్గవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణ(బృహస్పతి, శుక్రుడు, బుడుడు)
ఆకుపచ్చ చీర (బుదుడు)
తేనే నివేదన (రాహువు)
పులిహోర (శుక్రుడు,గురువు)

2. పటించవలసిన మంత్రము

ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః”

అనే మంత్రము 108 మార్లు జపించవలెను.
Omm im hreem sreem sree maathre namaha

శ్రీ లలితా మూలమంత్ర కవచమ్

అస్య శ్రీ లలితా కవచ స్ప్తవరత్న మంత్రస్య ఆనందభైరవి ౠషిః
అమృత విరాట్ చందః శ్రీ మహాత్రిపురసుందరీ లలితా పరాంబా దేవతా,
ఐం, బీజం, హ్రీం, శక్తిః, శ్రీం కీలకం, మమ శ్రీ లలితాంబా ప్రసాదసిధ్యర్ధే
శ్రీ లలితాకవచస్తవరత్నమంత్రజపే వినియోగః ఐమ్-అంగుష్టా – భ్యాం నమః
హ్రీం -తర్జనీభ్యాం నమః, శ్రీం-అనామికాభ్యాం నమః శ్రీం-మధ్యభాగ్యాం నమః
హ్రీం కనిష్ఠకాభ్యాంనమః ఐం -కరతలకర పృష్ఠ్యాంభ్యాం నమః
ఐం హృదయాయ నమః హ్రీం శిరసేస్వాహా – శ్రీం శిఖాయైవషట్ ;
శ్రీం- కవచాయహుం హ్రీం నేత్రత్రయాయావౌషట్;
ఐమ్-అస్త్రాయ ఫట్; భూర్భువస్సురోమితి దిగ్భందః

ధ్యానం :-

శ్రీవిద్యాం పరిపూర్ణ మేరుశిఖరే బిందు త్రికోణే స్థితాం
వాగీశాది సమస్తభూతజనీం మంచే శివాకారకే
కామాక్షీం కరుణా రసార్ణవమయీం కామేశ్వరాంక స్థితాం
కాంతాం చిన్మయ కామకోటి నిలయాం శ్రీబ్రహ్మవిద్యాంభజే | 1
పంచపూజాం కృత్యా యీని ముద్రాం ప్రదర్శ్య
కకారః పాతు శీర్షం మే ఏకారః ఫాలకంసదా
ఈ కారః చక్షుషీపాతు శ్రోత్రేరక్షే ల్లకారకః 2
హ్రీంకారః పాతు నాసాగ్రం వక్త్రం వాగ్భవ సంజికః
హకారః పాతు కంఠమే సకారః స్కంధదేశకం 3
కకారో హృదయం పాతు హకారో జఠరంతథా
లకారో నాభిదేశంతు, హ్రీంకారః పాతు గుహ్యకం 4
కామకూటస్సదా పాతు కటిదేశం మమావతు
సకారః పాతు చోరూ మే కకారః పాతుజానునీ 5
లకారః పాతు జంఘేమే హ్రీంకారః పాతు గుల్ఫకౌ
శక్తికూటం సదాపాతు పాదౌరక్షతు సర్వదా 6
మూలమంత్రన్త్రకృతం చైతత్కవచం యో జపేన్నరః
ప్రత్యహం నియతః ప్రాత స్తస్యలోకా వశంవదాః

లలితా పంచరత్నమ్:

ప్రాతః స్మరామి లలితా వదనారవిందం
బింబాధరం పృథుల మౌక్తిక శోభినాసమ్
ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండలాఢ్యం
మందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్ 1

ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీం
రక్తాంగుళీయ లసదంగుళి పల్లవాఢ్యామ్
మాణిక్యహేమ వలయాంగద శోభమానాం
పుండ్రేక్షుచాప కుసుమేషు సృణీర్దధానామ్ 2

ప్రాతర్నమామి లలితాచరణారవిందం
భక్తేష్టదాన నిరతం భవసింధుపోతమ్
పద్మాసనాది సురనాయక పూజనీయం
పద్మాంకుశధ్వజ సుదర్శన లాంఛనాఢ్యామ్ 3

ప్రాతఃస్తవే పరశివాం లలితాం భవానీం
త్రయ్యంత వేద్యవిభవాం కరుణానవద్యామ్
విశ్రమ్య సృష్టి విలయస్థితి హేతుభూతాం
విద్యేశ్వరీం నిగమ వాజ్ఞ్మన సాతి దూరామ్ 4

ప్రాతర్వదామి లలితే తవ పుణ్య నామ
కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి
శ్రీ శాంభవీతి జగతాం జననీ పరేతి
వాగ్దేవతేతి వచసా త్రిపురేశ్వరీతి 5

యః శ్లోక పంచకమిదం లలితాంబికాయాః
సౌభాగ్యదం సులలితం పఠతి ప్రభాతే
తస్మై దదాతి లలితా ఝటితి ప్రపన్నా
విద్యాం శ్రియం విమల సౌ ఖ్యమనంత కీర్తిమ్.

3. ఎవరు చేయాలి ?  ఎందుకు చేయాలి ? ఎలా చేయాలి ?

త్రిపురాత్రయములో రెండొవ శక్తి దేవత లలితా అమ్మవారు. దేవీ ఉపాసకులకు అమ్మ విశిష్ట ఫలములను ఇచ్చు దేవత. త్రిగుణాతీతమైన కామేశ్వర స్వరూపము. పంచదశాక్షరీ మహామంత్ర అధిష్టాన దేవతగా లలితాత్రిపురసుందరీ దేవిని ఆరాధిస్తారు. సకల లోకాతీతమైన కోమలత్వము కలిగిన మాతృమూర్తి అమ్మ.

ఈ అమ్మవారు చెరుకుగడ, విల్లు, పాశాంకుశాలను ధరించిన రూపములో, కుడివైపున లక్ష్మీదేవి, ఎడమవైపున సరస్వతీదేవి సేవలు చేస్తున్నటువంటి రూపములో లలితాదేవి అమ్మవారు భక్తులను అనుగ్రహిస్తుంది. అమ్మ శ్రీవిద్యా స్వరూపిణి. సృష్ఠి, స్థితి సంహార రూపిణి.అందువలన ఈ ఐదవ రోజు అమ్మవారికి శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి అలంకరణ చేసి ఆకుపచ్చ చీరను అమ్మవారికి అలంకరించిన పిదప తేనే, పులిహోర ను నైవేధ్యముగా సమర్పించి పై మంత్రములను జపించినచో జాతకములోని సర్వ గ్రహ దోషముల యొక్క తీవ్రత తగ్గి సంపూర్ణ అయురారోగ్యములు కల్గును. అంతేకాకుండా …,

  • దరిద్ర భాధలు తొలగి ఆర్ధిక సమస్యల నుండి బయట పడతారు .
  • స్త్రీలు ఈ పూజను చేయడము వలన సుమంగలి యోగము కల్గుతుంది.
  • విధ్యార్ధులు ఈ పూజా ను చేయడము వలన విధ్య లో గొప్ప రాణింపు కల్గుతుంది.జ్ఞాపక శక్తి పెరుగుతుంది.
  • ప్రత్యేకించి ఈ అమ్మవారు నవగ్రహములలో జీవ,జ్ఞాతి,జ్ఞాన,ఆకర్షనాది అంశాలను ప్రభావితం చేయు గ్రహములైన బృహస్పతి,శుక్రుడు,రాహు గ్రహములపై ఆధిపత్యమును కల్గి ఉన్నకారణము చేత ఈ పర్వదినమున ఈ అమ్మవారిని సశాస్త్రీయముగా ఆరాడించుట వలన …
  • మన దైనందిన జీవితము లో కనీస అవసరములకు లోతు లేకుండా ఉండును .
  • ఉదర ,శ్వాసకోసాది సమస్యల నుండి ఉపశమనం అభించును.
  • సంతాన దోషములు తొలగి సత్ సంతానము కలుగు అవకాశము కలదు.
  • విదేశీ ప్రయత్నములలో విజయావకాశములు పెరుగును.
  • వ్యాపారములందు అభివృద్ది కల్గును.

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

రాఘవేంద్ర. ఏం.ఏ. జ్యోతిష్యం.స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here