
Sri Maha Chandi Devi
1శ్రీ మహా చండీ దేవి
చండీ దేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీ దేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి, లేదా హైమవతి, శతాక్షి, శాకంభరీ దేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవాని అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గ, కాళి మరియు శ్యామ, చండీ లేదా చండిక, భైరవి, చిన్నమాస్త మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్వినీ మరియు చైత్ర మాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులలో ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలల్లో తల్లి చండీ దేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురణా దేవాలయాలలో చండీ దేవి ఒకటి. దుర్గా దేవి యొక్క తొమ్మిది రూపాల్లో ఒకటైన చండికా దేవి యొక్క రూపం గురించి ఇక్కడ తెలుసుకుందాం. చండీ దేవి ఎలా అవతార వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.