శ్రీ మహా లక్ష్మీదేవి అలంకరణ | 6th day of Navratri 2022

0
16543
ఈరోజు - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకరణ
Sri Mahalakshmi Alakarana dasara in Telugu

6th day of Navratri 2022

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

1. శ్రీ మహా లక్ష్మి దేవి అలంకరణ

 01/10/2022 – శనివారం

ఆశ్వయుజ శుద్ధ షష్ఠి,

ఆరువ రోజు శ్రీ మహా లక్ష్మి దేవి అలంకరణ (శనేశ్వరుడు, కుజుడు, రాహువు, కేతువు, పూర్ణ చంద్రుడు)

చిలుక పచ్చ చీర (బుధుడు)

బెల్లం నైవేద్యం (శనేశ్వరుడు + బృహస్పతి)

పాయసం (శుక్రుడు, చంద్రుడు)

2. పటించవలసిన మంత్రము

‘ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదా సర్వజనమ్యే వశమానయస్వాహా’

అనే మంత్రాన్ని 1108 సార్లు పటించాలి

‘Om shreem hreem kleem gloum gam ganapathaye varavarada sarvajanamye vashamanayaswaha’

మహాలక్ష్మ్యష్టకం

ఇంద్ర ఉవాచ
నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే |
శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౧ ||

నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి |
సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౨ ||

సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టభయంకరి |
సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౩ ||

సిద్ధిబుద్ధిప్రదే దేవి భుక్తిముక్తిప్రదాయిని |
మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౪ ||

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి |
యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౫ ||

స్థూలసూక్ష్మమహారౌద్రే మహాశక్తి మహోదరే |
మహాపాపహరే దేవి మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౬ ||

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మస్వరూపిణి |
పరమేశీ జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౭ ||

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే |
జగత్స్థితే జగన్మాతర్మహాలక్ష్మీ నమోఽస్తుతే || ౮ ||

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం యః పఠేద్భక్తిమాన్నరః |
సర్వసిద్ధిమవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా || ౯ ||

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం |
ద్వికాలం యః పఠేన్నిత్యం ధనధాన్యసమన్వితః || ౧౦ ||

త్రికాలం యః పఠేన్నిత్యం మహాశత్రువినాశనం |
మహాలక్ష్మీర్భవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా || ౧౧ ||

(పదకొండు సార్లు పటించవలెను)

3. ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

ఏడవ రోజు అమ్మవారికి మహా లక్ష్మి దేవి అమ్మవారి అలంకరణ చేసి చిలుక పచ్చ రంగు చీరను అలంకరించి బెల్లమును, పాయసమును నైవేద్యముగా సమర్పించి క్రింది మంత్రాలను జపించవలెను.

ఈ అమ్మవారిని ఈ రోజు పూజించే సమయములో ఇంటిలో కిన్చెత్తు కూడా బూజు కానీ చెత్త బుట్టలలో చెత్త కాని ఉండకూడదు. అలాగే నీటిని ఉంచుకునే పాత్రలలో నీరు సమృద్ధిగా (నిండుగా) ఉండేలా చూసుకోవాలి. అలాగే ఎట్టిపరిస్థితుల్లోను ఈ రోజు వివాదాలలో పాల్గొనడం కాని అనవసర ఆవేశానికి గురి కావడం కాని చెయ్యకూడదు. ఈ విధంగా ఇంట్లో పరిసరాలు అపరిశుబ్రంగా ఉండటంవలన శనేశ్వరుడి యొక్క ప్రభావం పెరిగి చేస్తున్న పనులలో ఆలస్యం అవ్వడము లేదా వృత్తి విషయములో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కునే అవకాశం ఉంది. అలాగే ప్రత్యేకించి ఈ పూజ చేసే సమయములో ఇంట్లో నీరు సమృద్ధిగా లేకపోవడం వలన చంద్రుడి యొక్క దుష్పరిణామాలు ఎదురవడం వలన అనవసర ప్రయాణాలు ఏర్పడి ధన వ్యయం జరగడం ,లేదా మోసపోవడం జరిగే అవకాశం ఉంటుంది.

  • ఈ రోజు అనవసర వివాదాలలో పాల్గొనడం వల్ల కుజుడి యొక్క ప్రభావం పెరి గి రుణ సమస్యలు ఏర్పడే అవకశం ఉంది.
  • విద్యా పరమైన విషయాలలో ఆటంకం ఎదుర్కునేవారు ఈ రోజు మేనమామల యొక్క ఆశీర్వాదము తీసుకోవడము లేదా విఘ్నేశ్వరుడి గుడిలో ఈ రోజు గరిక తో అర్చన చేయించుకోవడం ద్వార శుభం జరుగుతుంది.
  • ఉద్యోగ సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు నువ్వులు బెల్లము కలిపి ఉండలు తాయారు చేసి గోమాతకు తినిపించడం ద్వారా ఆయా విషయాలలో మేలు జరుగుతుంది.
  • ఆర్ధిక పరమైన సమస్యలతో బాధ పడేవారు ఈ రోజు సన్యాసులకు లేదా వృద్దాశ్రమంలో ఉన్నటువంటివారికి ఉల్లిపాయ ముక్కలు కలిపినటువంటి దద్దోజనాన్ని సమర్పించడం ద్వారా ధన వ్యయం తగ్గుతుంది.
  • అలాగే అవకశం ఉన్నవారు ప్రత్యేకించి వివాహం అయ్యిన స్త్రీలు ఈ రోజు పుట్టింటి వారి ఊరు కనుక దగ్గేరలో ఉంటె అక్కడకు వెళ్లి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దలకు మసాలా తో కుడినటు వంటి ఆహారమును కాని లేదా ఉల్లిపాయ ముక్కలు కలిపినటు వంటి పెరుగన్నము కాని వారి స్వహస్తాలతో తాయారు చేసి వడ్డించి తినిపించడం ద్వారా జాతకములోని శని, చంద్ర దోషము పోయి అనవసర ధన వ్యయము తగ్గి ధన యోగం (అవసరమైన మేర) కలుగుతుంది అని మన పురాతనమైన జ్యోతిష్య నాడి, తాంత్రిక సిద్ధాంతములు చెబుతున్నాయి.

గమనిక: ఈ రోజు పూజలో పాల్గొన్నవారు ఎట్టి పరిస్థితులలో కూడా స్త్రీల యొక్క మనసు నొప్పించారాడు అలాగే స్త్రీలు ఎంత క్లిష్టమైన పరిస్థితి ఏర్పడినా కూడా గట్టిగ అరవడం కాని ఆవేశంగా మాట్లాడటం కాని ఖచ్చితంగా చెయ్యకూడదు.

శ్రీ సరస్వతి దేవి అలంకరణ | 7th day of Navratri

రాఘవేంద్ర. ఏం.ఏ. జ్యోతిష్యం.స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here