శ్రీ రాజ రాజేశ్వరి దేవి అలంకరణ | Sri Rajarajeshwari Devi Alankaram in Telugu

0
12518
Sri rajarajeshwari devi
Sri Rajarajeshwari Devi Alankaram in Telugu

10th day of Navratri 2022 – Sri Rajarajeshwari Devi Alankaram in Telugu

ఇక పై రోజు శుభ సమయం కోసం మన AstroTags అప్లికేషన్ ని డౌన్లోడ్ చేసుకోండి.

వీటితో పాటు మీ జన్మ వివరాలు బట్టి రోజు మీరు ఏ పని చేయాలో ఏ పని చేయకూడదో తెలుసుకోండి. మరిన్ని వివరలకు
https://onelink.to/ppsjem

1. శ్రీ రాజ రాజేశ్వరి దేవి

05/10/2022 – బుధవారం

ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి)

10వ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి అమ్మవారి అలంకరణ (కేతు ,కుజుడు,శని ,శుక్రుడు,గురువు,బుదుడు) 

అనేక వర్ణాలు కలిగినచీర (కేతువు ,బుదుడు)

యథాశక్తి అన్నిరకముల నైవేద్యాలు పండ్లు నివేదన చేయవచ్చును (చంద్రుడు ,గురువు ,శుక్రుడు)

2. పటించవలసిన మంత్రములు

ఓం శ్రీ రాజ రాజేశ్వరి దేవ్యై నమః (om sri raaja rajeshwari devyey namaha)

ఓం దారిద్య నాశిన్యై నమః (om daaridya naasinyey namaha)

ఓం ధన ధాన్య కర్యై నమః  (om dhana dhaanya karyey namaha)

అనే మంత్రాలను 108 సార్లు పటించవలెను

యా దేవి సర్వ భూతేషు శాంతి రూపేన సంస్థితా

నమస్తస్యై  నమస్తస్యై నమస్తస్యై నమో నమః

అనే మంత్రాన్ని 41 సార్లు జపించవలెను.

శ్రీ రాజ రాజేశ్వరి అష్టకం

అంబా శాంభవి చంద్రమౌళిరబలాఽపర్ణా ఉమా పార్వతీ
కాళీ హైమవతీ శివా త్రినయనీ కాత్యాయనీ భైరవీ
సావిత్రీ నవయౌవనా శుభకరీ సామ్రాజ్యలక్ష్మీప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౧ ||

అంబా మోహిని దేవతా త్రిభువనీ ఆనందసందాయినీ
వాణీ పల్లవపాణి వేణుమురళీగానప్రియా లోలినీ
కళ్యాణీ ఉడురాజబింబవదనా ధూమ్రాక్షసంహారిణీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౨ ||

అంబా నూపురరత్నకంకణధరీ కేయూరహారావళీ
జాతీచంపకవైజయంతిలహరీ గ్రైవేయకైరాజితా
వీణావేణువినోదమండితకరా వీరాసనేసంస్థితా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౩ ||

అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ
బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురనుతా దేదీప్యమానోజ్జ్వలా
చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౪ ||

అంబా శూల ధనుః కుశాంకుశధరీ అర్ధేందుబింబాధరీ
వారాహీ మధుకైటభప్రశమనీ వాణీరమాసేవితా
మల్లద్యాసురమూకదైత్యమథనీ మాహేశ్వరీ అంబికా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౫ ||

అంబా సృష్టవినాశపాలనకరీ ఆర్యా విసంశోభితా
గాయత్రీ ప్రణవాక్షరామృతరసః పూర్ణానుసంధీకృతా
ఓంకారీ వినుతాసుతార్చితపదా ఉద్దండదైత్యాపహా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౬ ||

అంబా శాశ్వత ఆగమాదివినుతా ఆర్యా మహాదేవతా
యా బ్రహ్మాదిపిపీలికాంతజననీ యా వై జగన్మోహినీ
యా పంచప్రణవాదిరేఫజననీ యా చిత్కళామాలినీ
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౭ ||

అంబాపాలిత భక్తరాజదనిశం అంబాష్టకం యః పఠేత్
అంబాలోకకటాక్షవీక్ష లలితం చైశ్వర్యమవ్యాహతమ్
అంబా పావనమంత్రరాజపఠనాదంతే చ మోక్షప్రదా
చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీరాజరాజేశ్వరీ || ౮ ||

||ఇతి శ్రీ రాజ రాజేశ్వరి అష్టకం సంపూర్ణం||

ఈ అష్టకాన్ని 11 సార్లు పటించవలెను

3. ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

ఈ రోజు అమ్మవారిని శ్రీ రాజ రాజేశ్వరి మాత రూపము లో తయారు చేసి, అనేక వర్ణములు కల్గిన లేదా విచిత్ర వర్ణములు కల్గిన చీరతో  అలంకరించి యధాశక్తి అన్నిరకముల నైవేధ్యములతో పాటుగా వివిద ఫలములను కూడా ప్రాసాదముగా సమర్పించాలి. ఈ రోజు అమ్మవారిని ఈ విదముగా పూజించడము వలన జాతకములో బలహీనముగా ఉన్న ఆయా గ్రహముల బలము పెరగడమే కాకుండా దోషపూరితమైన గ్రహముల యొక్క దోషప్రభాము కూడా తగ్గే అవకాశముయి కలదు .

  • ప్రత్యేకించి ఈ అమ్మవారు మంత్ర సిద్దులకు, తంత్ర శక్తులకుయి అధిదేవత కనుక మంత్ర ఉపదేశము ఉన్నవారు లేదా వివిద అనుష్టానములు ఉన్నవారు. ఈ రోజున విధిగా ఆయా మంత్రములను జపం చేయుట ద్వారా శక్తిని పరిపుష్టం చేసుకొను అవకాశము కలదు .
  • జాతక చక్రములో బుధ, కేతు సంభందం వలన ఏర్పడు విధ్యటంకములనుండి విముక్తి లభిస్తుంది .
  • మంద బుద్ది నశించి బుద్ది వికసించి జ్ణానము పెరుగుతుంది .
  • స్త్రీ /పురుషులకి వివాహ ప్రయత్నములలో కల్గు ఆటంకములు తొలగి సకాలములో వివాహం అవుతుంది.
  • ఆలుమగల మధ్య ఉన్న స్పర్ధలు తొలగి కుటుంబసౌఖ్యం కల్గుతుంది .
  • సర్ప దోషము వలన కలుగు అబార్షన్స్ ఆగిపోయి, సంతానము కల్గుతుంది .
  • రుణభాధల నుండి ఉపశమనం లభిస్తుంది.
  • వృత్తి లో ఉన్న ఆటకములు తొలగి పోతాయి.

ప్రత్యేకించి గొంతు, చర్మ, ఉదర, నరాల పరమైన అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. (పై ఆరోగ్య సమస్యలు ఉన్న వారు ఈ రోజు నాబి వరకు నీటిలో ఉండి మంత్ర జపం కనీసం గంట సమయం చెయ్యాలి. ఈ రోజు మొత్తం పూర్తిగా ద్రవాహారాన్ని మాత్రమే తీసుకోవాలి. నేల మీద (చాప వాడుకోవచ్చు) పడక వెయ్యాలి.)

కోరిన‌ కోరిక‌లు వెంట‌నే తీరాలంటే ఏం చేయాలి?

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here