శ్రీ సరస్వతి దేవి అలంకరణ

0
8252

Next బటన్ నొక్కకుండా మొత్తం కంటెంట్ సింగల్ పేజీ లో మరింత సులువుగా చదవటానికి మన హరి ఓం యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి Android / iOS

1. శ్రీ సరస్వతి దేవి అలంకరణ

14-10-2018 – ఆదివారం  

ఆశ్వీయుజ శుద్ధ సప్తమి

ఐదువ రోజు శ్రీ మహా సరస్వతి దేవి అలంకరణ (కేతువు, బుధుడు, రాహువు)

తెలుపు రంగు చీర (చంద్రుడు, కుజుడు)

జీడిపప్పు నివేదన (బుధుడు)

కొబ్బరికాయ (శని, కుజుడు)

 

2. పటించవలసిన మంత్రములు

“సరస్వతి నమస్తుభ్యం వరదే కామ రూపిణీ

విద్యా రంభం కరిష్యామి సిద్ధిర్భవతు మేసదా”

అనే మంత్రమును 41 సార్లు పటించాలి.

‘‘ఓం వాగ్దేవి నమః (om vadgdevi namaha)

ఓం జ్ఞాన ప్రదాయినే నమః (om gnana pradayine namaha)

ఓం శారదాయై నమః (om sharadayey namaha)’’

ఈ మంత్రాలను 108 సార్లు పటించినచో సర్వాభీష్ట ఫలములు కలిగి జ్ఞానము అభివృద్ధి కలుగును.

 

సరస్వతి ద్వాదశ నామ స్తోత్రం

సరస్వతీ త్వియం దృష్ట్యా, వీణా పుస్తక ధారిణి
హంస వాహ సమాయుక్తా విద్యా దానకరీ మమ ||1||
ప్రథమం భారతీనామం ద్వితీయం చ సరస్వతీ
తృతీయం శారదా దేవి చతుర్ధం హంస వాహిని ||2||

పంచమం జగతీ ఖ్యాతం షష్టమం వాగీశ్వరితథా
కౌమారి సప్తకం ప్రోక్రమష్టమం బ్రహ్మచారిని||3||

నవమం బుద్ధి ధాత్రీ చ దశమం వరదాయినీ
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదాశం భువనేశ్వరీ ||4||

బ్రాహ్మి ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః
సర్వ సిద్ధి కరీం తస్య ప్రసన్న పరమేశ్వరి ||5||

సామే వసతు జిహ్వాగ్రే బ్రహ్మ రూపీ సరస్వతీ
ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశ నామ స్తోత్రం సంపూర్ణం ||6||

ఈ స్తోత్రాన్ని 11 సార్లు పటించవలెను

 

3. ఎవరు చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? ఎలా చెయ్యాలి?

7 వ రోజు అమ్మవారికి సరస్వతి దేవి (కొన్ని ప్రదేశాలలో కాళరాత్రి) అలంకరణ చేసి తెలుపు రంగు చీరను (అవకాశం ఉన్నవారు మరువం ఆకులతో అల్లిన మల్లెపూల దండను సమర్పిస్తే చాలా పిల్లలకు తెలివితేయటలకు చాలామంచిది) అలంకరించి జీడి పప్పుతో చేసిన తీపి వంటకాలను మరియు కొబ్బరికాయలను నైవేద్యము గా సమర్పించి క్రింద ఇచ్చిన మంత్రములను భక్తి శ్రద్దలతో జపించవలేను .

ఈ అమ్మవారిని ఈ రోజు పూజించే సమయములో విధ్యార్ధులు ఎట్టి పరిస్థితులలో కూడా దరించే బట్టలు ఎరుపు రంగు లేకుండా చూసుకోవలేను. దీని వలన విధ్యలో ఆటంకము రావడము జరగవచ్చు. అలాగే వ్యాపారస్తులు పూజా చేయు సమయంలో బూడిద వర్ణం లేదా సిమెంటు రంగు బట్టలను దరించరాదు.

ఈ రోజు అమ్మవారిని సశాస్త్రీయముగా పూజించడము వలన ….,

  • విధ్య లో ఆటంకములు తొలగుతాయి.
  • స్థిర ఆస్తుల విషయములలో ఏర్పడిన వివాదములు ఒక కొలిక్కి రావడానికి అవకాశం ఉంది.
  • విదేశీ ప్రయత్నములు ఫలిస్తాయి.
  • స్త్రీలకు వివాహాటంకములు తొలగి మంచి వరుడు లభించుటకు అవకాశం ఉంది.
  • ముఖ్యముగా ఎవరితే నరాల / ఉదర / కండరాల సమస్యలతో భాదపడుతూ ఉపశమనం కొరకు ఎదురుచూస్తూ ఉంటారో వారికి ఈ రోజు చాలా ప్రశస్తమైన రోజుగా చెప్పవచ్చు.

“మీ ఆధ్యాత్మిక సాధనకు సహాయం చేయటానికి మన హరి ఓం యాప్ ని అందిస్త్నుం.”

ఇకపై మీ వ్యక్తి గత సమస్యల పరిష్కారానికి, ముహూర్తాలకు, మంచిరోజుల నిర్ణయానికి మీ వ్యక్తిగత వివరాలను బట్టి మేము ప్రపంచ ప్రఖ్యాత గాంచిన జ్యోతిష్యులతో, మీ ప్రశ్నకు జవాబు సూచిస్తాము.

వీటితో పాటు ప్రతి రోజు పంచాంగం, రాశిఫలాలు, ఆధ్యాత్మిక సమాచారం, నీతి కథలు, మరెన్నో విషయాలను తెలుసుకోవటానికి మన Hari Om App ని డౌన్లోడ్ చేసుకోండి.

మీరు ఇప్పటికే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్ కోసం ఖచితంగా అప్డేట్ చేసుకోండి

Android

iOS

రాఘవేంద్ర. ఏం.ఏ. జ్యోతిష్యం.స్వర్ణ పతక గ్రహీత
ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష బిరుదు విశ్వభంధు గ్రహీతలు
కనినిక ,కశేరుక ,నిమిత్త నాడీ జ్యోతిష పరిశోధకులు
జూబ్లీహిల్స్ రోడ్ నెం : 5
హైదరాబాద్
astroguru81@gmail.com

 


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here