శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam

0
2583

శ్రీ సూర్యనారాయణ దండకము – Sri Surya Narayana dandakam

శ్రీ సూర్యనారాయణా వేదపారాయణా లోకరక్షామణీ దైవ చూడామణీ ఆత్మ రక్షా నమః పాపశిక్షా నమో విశ్వకర్తా నమో విశ్వభర్తా నమో దేవతా చక్రవర్తీ పరబ్రహ్మమూర్తీ త్రిలోకైకనాథా మహాభూత ప్రేతంబులన్నీవయై బ్రోవు నెల్లప్పుడున్ భాస్కర హస్కరా. పద్మినీ వల్లభా వల్లకీగానలోలా త్రిమూర్తి స్వరూపా విరూపాక్ష నేత్రా మహాదివ్యగాత్రా అచింత్యావతారా నిరాకార ధీరా పరాకయ్య వోయయ్య దుర్ధాంత నిర్ధూత తాప్రతయాభీల దావాగ్ని రుద్రా తనూద్భూత నిస్సార గంభీర సంభావితానేక కామాద్యనీ కంబులన్ దాకి ఏకాకినై చిక్కి ఏదిక్కునుం గానగా లేక యున్నాడ నీ వాడనో తండ్రీ. జేగీయమానా కటాక్షంబులన్ నన్ కృపాదృష్టి వీక్షించి రక్షించు వేగన్ మునీంద్రాదివంద్యా జగన్నేత్రమూర్తీ ప్రచండస్వరూపుండవై యుండి చండాంశు సారధ్యమున్ గొంటి న కుంటి యశ్వంబు లేడింటి చక్రంబులున్ దాల్చి ద్రోలంగ మార్తాండ రూపుండవై చెండ రాక్షసాధీశులన్ గాంచి కర్మానుసారాగ్ర దోషంబులన్ ద్రుంచి కీర్తి ప్రతాపంబులన్ మించి నీదాసులన్ గాంచి యిష్టార్ధముల్ గూర్తువో. దృష్టివేల్పా మహాపాప కర్మాలకున్నాలయంబైన యీ దేహభారంభ భారంబుగానీక శూరోత్తమా ఒప్పులన్ తప్పులన్ నేరముల్ మాని పాలింపవే సహస్రాంశుండవై నట్టి నీకీర్తి కీర్తింపనే నేర్తునా ద్వాదశాత్మాదయాళుత్వమున్ దత్వమున్ జూపి నా ఆత్మ భేదంబులన్ బాపి పోషింప నీవంతు నిన్నున్ ప్రశంసింప నావంతు ఆ శేషభాషాధిపుల్ గానగా లేరు నీ దివ్యరూప ప్రభావంబు గానంగ నేనంత ఎల్లప్పుడున్ స్వల్పజీవుండ నౌదున్ మహాకష్టుడన్ నిష్టయున్ లేదు నీ వదపద్మంబులే సాక్షి దుశ్చింతలన్ బాపి నిశ్చింతుగన్ జేయవే కామితార్థ ప్రదా.శ్రీమహాదైవరాయ పరావస్తులైనట్టి మూడక్షరాలన్ స్వరూపంబు నీ దండకం బింమ్మహిన్ రాయ కీర్తించి విన్నన్ మహాజన్మ జన్మాంతర వ్యాధి దారిద్ర్యముల్ పోయి కామ్యార్థముల్ కొంగు బంగారు తంగేడు జున్నై ఫలించున్ మహాదేవ దేవా నమస్తే నమస్తే నమః

Download PDF here Sri Surya Narayana dandakam – శ్రీ సూర్యనారాయణ దండకము

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here