శత్రుభయంకరుడు – రవిసోమేశ్వరవాసుకేశ్వరుడు

0
421

భక్తజనులకు కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ ఉమవాసుకి రవి సోమేశ్వర క్షత్రం – జుత్తిగ

శ్రీ విష్ణు స్వరూపుడైన వ్యాస మహర్షి 18 పురాణాలు చెప్పారు. అందు వాయు పురాణమొకటి. ఆ వాయు పురాణముగోస్థనీ నదీ మహాత్యము, శ్రీ ఉమావాసుకి రవి సోమేశ్వర క్షేత్ర ప్రస్థావన కలదు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలో జుత్తిగ అని పిలవబడుతున్న ఈ దూతికాపు రమున శ్రీ ఉమావాసుకి రవి సోమేశుడు వెలసివున్నాడు..

ఈ ఈశ్వరుడు నిత్య పుష్కరిణియూ, ఉత్తరవాహినియూ అయిన గోస్తనీ నదీ తీరమున వాసుకి రవి సోములచే ప్రతిష్టించబడినాడు. త్రేతాయుగమున దుష్టుడైన రావణాసురుడు వాసుకి అను సర్పరాజును, రవి (సూర్యుడు)ని, సోము (చంద్రుడి)ని పరాభవించాడు. రావణుని పరివారమైన భయంకర రాక్షసులు దేవతలందరిని పీడింపసాగిరి. వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, ధనుంజయుడు అను సర్పములచే రావణుని రథమును మోయించారు.

రావణ భటులచే పీడింపబడిన లోకోపకారులైన సూర్య చంద్రులు (రవి, సోములు) వాసుకి గోస్తనీనదీ తీరమున ప్రతిష్టించి పూజించిరి. కాన ఈ లింగమునకు వాసుకి రవి సోమేశ్వర లింగమని పేరు కలిగింది. అనంతర కాలమందు శ్రీ విష్ణువు రాముడై జననమంది రావణాదులను నశింపచేసాడు. సృష్ట్యాదినుండి నేటివరకు రావణుడు ఏడుసార్లు అవతరించెనని పురాణాలు చెప్తున్నవి. 

గోదావరి నది కన్నా పురాతనమైన గోస్తనీ నది బస్తరు జిల్లా ధేను పర్వతమునందు జన్మించి నాలుగు పాయలై ఒక పాయ దూతికాపురం(జిత్తిగ) మీదుగా ఉత్తరవాహినిగా ప్రవ హించి కాళీపట్నం వద్ద సముద్ర సంగమం చేస్తోంది. ఇట్టి పవిత్ర గోస్తనీ నదీ తీరమున వెలసిన శ్రీ ఉమా వాసుకీ రవి సోమేశ్వర క్షేత్రము భక్త జనులకు ఇహపర సౌఖ్యము లిచ్చు కొంగు బంగారమై విరా జిల్లుతున్నది.

ఈ ఆలయంలో ఉత్తరమున దక్షిణాభిముఖముగా శ్రీ పార్వతీ దేవి ఎడమ భాగమున శ్రీ భద్రకాళీ వీర భద్రేశ్వరులు, శివలింగమునకు ఎదురుగా ముఖ మండపమున శ్రీ అనిస్రమ్మ, శ్రీ శారదాదేవి, శ్రీ కుమారస్వామి నెలకొనివున్నారు. స్మార్తా గమ ప్రకారంగా ఈ ఆలయమున మొదటి  ప్రాకారంలో పంచాయతన పద్దతిలో వాయ వ్యమున శ్రీ లక్ష్మీ జనార్దనస్వామి, ఈశాన్య మున శ్రీ సూర్యనారాయణస్వామి, శ్రీ కాలభైరవస్వామి, ఆగ్నేయమున గణపతి, నైరుతి దిక్కున శ్రీదుర్గాదేవి ప్రతిష్ఠింపబడి పూజలం దుచున్నారు.                                                                                                      

More Video Links-

Link – 1

Link – 2

Link – 3


Warning: A non-numeric value encountered in /home/hariom15/public_html/hariome.com/wp-content/themes/Newspaper/includes/wp_booster/td_block.php on line 1009

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here