పట్టణ సంస్కృతిలో పడి పశువుల పట్ల ప్రేమను, వాటితో ఉండే అనుబంధం చాలామంది చవిచూడరు. కుక్కలు, పిల్లులు వంటి జంతువుల పెంపకం కొంతవరకు మనుషులకి జంతువుల ప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. కానీ ఆవులు, ఎడ్లు, మేకలు వంటి జంతువుల పోషణ,పెంపకం ఉన్న పల్లెటూళ్లలో వారు పాడిని, పశువులను ఇంట్లో సభ్యులుగా, దేవతలుగా భావిస్తారు. అలా తన ఎడ్లను కన్నకొడుకుల్లా భావించిన ఒక రైతుకథ తెలుసుకుందాం.
1. రామయ్య ఎడ్లు
రాచరిక వ్యవస్థ ఉన్నప్పటి కాలం అది. ఒక ఊళ్ళో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతని దగ్గర అత్యంత శ్రేష్టమైన నాగౌరు గిట్టలు అనే రకానికి చెందిన ఎడ్లు రెండు ఉండేవి. అవి పొలం దున్నటం లో రామయ్యకు ఎంతో సహాయం చేసేవి. మేలు జాతి గుర్రం కన్నా వేగంగా పరిగెత్తేవి. రామయ్య ఆ ఎడ్లను ఎంతో అపురూపంగా చూసుకునేవాడు.
Promoted Content