హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu

0
18408
హనుమాన్ చాలీసా ఎలా పుట్టింది? | Story of Hanuman Chalisa in Telugu
Story of Behind Hanuman Chalisa in Telugu

Story of Hanuman Chalisa in Telugu

2. రామనామ మహిమ

తులసీ దాసు బోధనల చేత ఎంతోమంది అన్య మతస్థులు కూడా రాముని భక్తులయ్యారు. ముస్లిమ్ రాజైన అక్బర్ పరిపాలిస్తున్న కాలం అది. తులసీ దాసుపై ఈర్ష్యను పెంచుకున్న అన్య మతస్థులు అక్బర్ పాదుషాకు తులసీ దాసు పై ఫిర్యాదులు చేసేవారు. ఇదిలా ఉండగా వారణాసిలో ఒక సదాచార సంపన్నుడయిన గృహస్తు, తన ఏకైక కుమారునికి ఓ చక్కని అమ్మాయితో వివాహం జరిపించాడు. వారిద్దరూ ఆనందంగా జీవనం సాగిస్తుండగా, విధి వశాత్తు ఆయువకుడు కన్నుమూశాడు. జరిగిన దారుణానికి తట్టులేకపోయిన అతని భార్య హృదయవిదారకంగా విలపించసాగింది. చనిపోయిన యువకునికి అంత్యక్రియలు జరుగకుండా అడ్డుపడుతూ రోదిస్తున్న ఆమెను, బంధువులంతా బలవంతంగా పట్టుకొని వుండగా, శవయాత్ర సాగిపోతున్నది. స్మశానానికి వెళ్ళేమార్గం తులసీదాస్ ఆశ్రమం మీదుగానే సాగుతుంది. శవయాత్ర ఆశ్రమం వద్దకు వచ్చే సమయానికి తనను పట్టుకొన్నవారిని వదిలించుకుని పరుగుపరుగున ఆమె ఆశ్రమంలోకి చొరబడి తులసీదాస్ పాదాలపై పడి విలపించసాగింది. ధ్యాననిమగ్నులైన తులసీదాస్ కనులు తెరిచి ‘దీర్ఘసుమంగళిభవ’ అని దీవించాడు. దానితో ఆమె కడుదీనంగా జరిగిన సంగతిని వివరించి, జరుగుతున్న శవయాత్ర చూపించింది. వెంటనే తులసీదాస్ తల్లీ! రాముడు నా నోట అసత్యం పలికించడు! అని శవయాత్రను ఆపి, శవం కట్లు విప్పించి రామనామాన్ని జపించి, తన కమండలంలోని జలాన్ని చల్లాడు. ఆ మరుక్షణం ఆ యువకుడు పునర్జీవితుడయ్యాడు. మరిన్ని వివరాల కోసం తరువాతి పేజీలో చూడండి.

Promoted Content

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here