కుబేరుడికి అంత సంపదలెలా దక్కాయి?

5
13233

Back

1. కుబేరుడికి అంత సంపదలెలా దక్కాయి?

కుబేరుడు అనగానే ఎవరికైనా సరే ధనాధిపతి అని వెంటనే గుర్తుకొస్తుంది. కుబేరుడు కేవలం ధనానికి మాత్రమే అధిపతి కాదు. ఆయన అధీనంలో కొన్ని దేవతా గణాలు కూడా ఉంటాయి. ఇలా కుబేరుడుని శివుడు అనుగ్రహించిన సందర్భం శివపురాణం రుద్రసంహిత సృష్టిఖండంలో కనిపిస్తుంది. కుబేరుడు అనేది అసలు పేరు కాదు. ఆయనను వైశ్రవణుడు అని పిలుస్తుండేవారు. దీనికి కారణమేమంటే విశ్రవసు వుకు ఈయన జన్మించటమే. అలా జన్మించటానికి కారణం కూడా ఉంది. పూర్వజన్మలో గుణనిధి అనే పేరున ఉండి అంత్యకాలంలో ఉపవాసం ఉండి శివాలయంలో దీపారాధన చేసి కన్నుమూయటమే. ఆ పుణ్యఫలంవల్ల వైశ్రవణుడిగా జన్మించటమేకాక శివుడికి అత్యంత సన్నిహితంగా ఉండే అవకాశాన్ని కూడా పొందాడు. వైశ్రవణుడికి పుణ్యప్రభావంవల్ల గత జన్మలో తాను చేసిన ఉపవాస, దీపారాధన ఫలితం బాగా గుర్తుంది. అందుకే మళ్లీ జన్మించాక మరింత శివభక్తిని, శివ అనుగ్రహాన్ని పొందటం కోసం కాశీ నగరానికి వచ్చి గంగాతీరంలో తీవ్రంగా తపస్సు చేశాడు.

Promoted Content
Back

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here