కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu

0
2548
కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu
Story of Kumbha Mela in Telugu

కుంభమేళా కథ | Story of Kumbha Mela in Telugu

కుంభమేళా ఎలా ప్రారంభమైంది

అమృతం కోసం దేవదానవులంతా కలిసి సముద్ర మథనం చేశారు. అప్పుడు క్షీర సాగరం నుండి ఒక అమృతభాండం వెలికి వచ్చింది. భాండం అంటే కుండ దానికి మరో పేరే కుంభం. ఆ అమృత కుంభం కోసం దేవదానవులు కలియబడ్డారు. మొత్తం ఒక వర్గం వారే అనుభవించాలన్న కాంక్షతో ఇరువర్గాలవారూ ఆ కుంభాన్ని పట్టుకుని చెరోవైపుకూ లాగారు.. అప్పుడు ఆ కుంభం లోని కొన్ని అమృతపు బిందువులు భూమిమీద నాలుగు చోట్ల పడ్డాయి. అవే హరిద్వార, ప్రయాగ, ఉజ్జయిని, నాసిక్. ఆ ప్రాంతాలలో ప్రవహించే పుణ్యనదులలో అమృత కుంభం నుండి బిందువులు పడ్డాయి కనుక ఆ పుణ్య నదులకు నిర్దిష్టమైన గ్రహ కూటములలో అమృత ప్రభావం ఉంటుంది. ఆ సమయం లోనే కుంభమేళా నిర్వహిస్తారు.

సూర్యుడు మేష రాశిలోనూ బృహస్పతి సింహరాశిలోనూ ఉన్నప్పుడు ఉజ్జయిని లోని క్షిప్రా నదిలో దివ్యశక్తులు ప్రవహిస్తాయి. ఆ సమయం లో జరిగే కుంభమేళాలో పాల్గొని పుణ్య స్నానాలు ఆచరించినవారికి సకాలదోషాలూ, సర్వ పాపాలూ నశిస్తాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సంప్రాప్తిస్తాయి. 22-04-2016 నుండీ 21-05-2016 వరకూ ఉజ్జయిని లో సింహస్థ కుంభమేళా జరుగుతున్నది.

శుభం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here