Story to Read on Shivaratri in Telugu | శివరాత్రి రోజు చదవవలసిన కథ

1
31713
Story to Read on Shivaratri in Telugu
Story to Read on Shivaratri in Telugu 2023

Story to Read on Maha Shivaratri 2023 in Telugu

2. మహా శివరాత్రి వ్రత కథ (Mahashivratri Vrat Katha)

స్వామీ ..! పూర్వ జన్మలో నేను సుస్వరుడనే కిరాతుడిని. వారణాసి ప్రాంతం లో నివసించే వాడిని. ఒకనాడు నేను అడవిలో వేటాడుతూ అలసిపోయి ఒక చెట్టుపై నిద్రించాను.

నిద్రలేచే సరికి చుట్టూ చీకట్లు కమ్ముకుని ఉన్నాయి. రాత్రి సమయమైందని గమనించి, దుర్గమమైన ఆ అడవిలో రాత్రిపూట ఎటూ వెళ్ళడం శ్రేయస్కరం కాదని ఆ చెట్టుపైనే ఉండిపోయాను.

రాత్రి పూట చినుకులు పడుతుండగా నిద్రపోలేక ఆ చెట్టు మీది ఆకులను తెంపుతూ కింద పడేస్తూ మేలుకుని ఉండిపోయాను. అది బిల్వ వృక్షం. ఆ చెట్టు కింద ఒక శివ లింగం ఉన్న విషయాన్ని అప్పుడు నేను గమనించలేదు. అపూట నాకు భోజనం కూడా దొరకలేదు. ఉపవాసం చేయాల్సివచ్చింది. తెల్లవారి ఇంటికి చేరుకుని  అతిథికి భోజనం పెట్టిన తర్వాతే నేను భుజించాను. మరణించిన తరువాత జీవుని తీసుకు వెళ్లడానికి యమభటులు వచ్చారు. వారి వెంటనే శివగణాలు కూడా నన్ను తీసుకుని వెళ్లడానికి వచ్చారు. వారిరువురూ నన్ను తీసుకు వెళ్ళే విషయం లో ఘర్షణ పడ్డారు. చివరికి శివగణాలే గెలిచాయి. యమ భటులు పరాజితులై యమధర్మ రాజు వద్దకు వెళ్ళి విషయం విన్నవించారు. అప్పుడు యమధర్మరాజు ఇలా అన్నాడు.  “అతను మహా శివరాత్రినాడు అసంకల్పితంగా బిల్వ పత్రాలతో శివుని పూజించాడు. అభిషేకించాడు. ఆనాడు ఉపవసించి, జాగరణ చేశాడు. ఆ పుణ్య విశేషం వలన, మరణానంతరం ఆ జీవిని తీసుకుని వెళ్లడానికి శివగణాలు వచ్చాయి.”   అని చెబుతాడు.

ఆ విధంగా తెలియక అసంకల్పితంగా మహా శివరాత్రి నాడు శివార్చన చేసిన పుణ్యం వలన నేను శివసాన్నిధ్యాన్ని అనుభవించానని. చిత్ర భానుడు అష్టావక్ర ముని తో చెప్పాడు.

  • ఇది మహా శివరాత్రి వ్రత కథ. మహా శివరాత్రి నాడు ఈ కథను విన్నవారూ చదివిన వారూ జీవిత కాలం లో సకల శుభాలను అనుభవించి. మరణానంతరం శివసాన్నిధ్యాన్ని పొందుతారు.
Promoted Content

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here