రథసప్తమి రోజున ఇలా చేస్తే…విముక్తికి మార్గం | On ratha saptami how to Avoid Surya Dosha in Telugu

0
3706

రథ సప్తమి విశేషత

1. ప్రతి ఆదివారం దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఉదయం 6 గంటల నుండి 7 గంటలవరకు ప్రదక్షిణాలు చేయండి.
2. 6 ఆదివారాలు నవగ్రహములకు 60 ప్రదక్షిణాలు చేసి 1.25 కిలోలు గోధుమలు దానం చేయండి.
3. ఆదివారంనాడు శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి  దర్శించి సూర్య నమస్కారాలు చేసి, 60 ప్రదక్షిణాలు చేయండి.
4. ఆదివారం రోజున పేదలకు, సాధువులకు చపాతీలు పంచి పెట్టండి.
5. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం ఆలయానికి వెళ్ళి ఎర్రని వస్త్రములో గోధుమలు దానం చేయండి.
6. వెండిలో కెంపును పెట్టించి ఉంగరం చేయించి, ఆదివారం ఉదయం 6 గంటలకు ఎడమచేతి వేలికి ధరించండి. తర్వాత 1.25 కిలోల గోధుమలు దానం చేయండి.
7. బ్రాహ్మణుడితో రవి గ్రహ జపం చేయించి గోధుమలు దానం చేయండి.
8. నవగ్రహములలో సూర్యగ్రహణము వద్ద ఆదివారం ఎర్రరంగు వస్త్రంతో 6 వత్తులు వేసి, దీపారాధన చేసి ఎర్రని వస్త్రములు దానం చేయండి.
9. 7 ఆదివారములు ఉపవాసము ఉండి చివరి ఆదివారం సూర్యునికి అష్టోత్తర పూజ చేయించండి. అలాగే, శివునికి అభిషేకం చేయించండి.
10. తమిళనాడులోని సూర్యవార్ దేవస్థానము దర్శించి సూర్య హోమము చేయించండి.
11. ఆదివారంనాడు శ్రీరామ, శివాలయాల్లో పేదలకు అన్నదానం చేసి, ప్రసాదం పంచండి.
12. రవి ధ్యాన శ్లోకమును లేదా ఆదిత్య హృదయము రోజుకు 60 సార్ల చొప్పున 60 రోజులు పారాయణ చేయండి.
13. రవిగాయత్రీమంత్రమును 6 ఆదివారములు 60 మార్లు పారాయణం చేయండి.
14. రవి మంత్రమును 40 రోజుల్లో 6వేలసార్లు జపం చేయాలి, లేదా ప్రతి రోజూ సూర్యాష్టకం పారాయణ చేయాలి.
15. తీరికలేని వారు రవి శ్లోకము కనీసం 6 మార్లుగాని, రవి మంత్రం 60 మార్లు గానీ పారాయణ చేయాలి. లేదా నిత్యం సూర్య నమస్కారాలు చేయాలి.
16. రథసప్తమి రోజున 6 మార్లు సూర్యాష్టకం జపించాలి.

 

https://www.facebook.com/photo.php?fbid=1126889570668782&set=a.404512062906540.98649.100000432482947&type=3&theater

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here