
స్థూలకాయాన్ని దూరం చేసే సూర్య ముద్ర | Surya Mudra for Weight Loss in Telugu
Surya Mudra for Weight Loss – సూర్యుడు ఉత్తేజానికి ఉత్సాహానికి సంకల్ప శక్తికి ప్రతీక. సూర్య ముద్ర శరీరాన్ని అనేక జాడ్యాల నుండీ దూరం చేసి, ఉత్తేజాన్ని కలిగించడమే కాక శరీరం లో పేరుకుపోయి హాని కలిగించే కొవ్వులను కరిగిస్తుంది.
1. సూర్య ముద్ర ఎలా వేయాలి ..?
- నిటారుగా నిలబడాలి. లేదా పద్మాసనం గానీ సుఖాసనం గానీ వేసుకుని నిటారుగా కూర్చోవాలి.
- చేతులను ముందుకి చాపాలి.
- ఉంగరపు వేలును బొటనవేలు అడుగు భాగానికి తగిలేలా వంచాలి.
- బొటన వేలితో ఆ వంచిన ఉంగరపు వేలిని మెల్లిగా కదలకుండా నొక్కి ఉంచాలి.
- మిగతా వేళ్ళు వంగకుండా చూసుకోవాలి.
- రోజుకు 15 నిముషాలుగల మూడు విడతలు గా 45 నిమిషాల పాటు(15*3) సూర్య ముద్రను వేయవచ్చు.
Promoted Content
Nice