స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్రకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి తరవాత స్వామి పరిపూర్ణానంద ను హౌస్ అరెస్ట్ చేసారు. అయినా సరే తాను ఎట్టి పరిస్తితుల్లోనైనా తాను ధర్మాగ్రహ యాత్ర ను చేపడతానని చెప్పారు .
అయితే తాజాగా స్వామి పరిపూర్ణానంద రెండు రోజుల గృహ నిర్బంధం అనంతరం బుధవారం తెల్లవారుజామున పోలీసులు పరిపూర్ణానంద ను అరెస్ట్ చేసారు . అలాగే గతం లో తాను చేసిన ప్రసంగాలు అభ్యంతకరంగా ఉన్నాయని చెప్పి పరిపూర్ణానంద ను ఆరు నెలల పాటు నగర బహిష్కరణ చేసి పోలీసులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో గోప్యాంగ ఉంచారు. అయితే స్వామి పరిపూర్ణానంద ను కాకినాడ శ్రీపీఠానికి కానీ శ్రీశైలం కు కానీ తీసుకెళ్తున్నట్టు తెలుస్తుంది .
అయితే ఈ విషయం లో స్వామి పరిపూర్ణానంద పోలిసుల చర్యల ఫై తన అసహనం వ్యక్తం చేస్తూ న్యాయం , ధర్మం రెండు కల్లుగా భవిస్తూ జీవిస్తున్నానని ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందన్న నమ్మకం ఉందని ఎవరు ఆందోళన చెందవద్దని చెప్పారు .