తిరుమల వివాదంపై స్పందించిన స్వామి

0
876

తిరుమల శ్రీవారి ఆలయం మహా సంప్రోక్షణ వివాదంపై స్వామి పరిపూర్ణానంద స్పందించారు. మహా సంప్రోక్షణ సమయంలో భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించాలని స్వామీజీ డిమాండ్ చేశారు. అసలు మహా సంప్రోక్షణ అంటే ఏమిటో భక్తులకు తెలియజేయాలని స్వామీజీ సూచించారు. మహా సంప్రోక్షణ పేరిట భక్తులెవరూ శ్రీవారి దర్శనానికి రాకూడదని మీడియాలో వస్తున్న కథనాల కారణంగా కోట్లాది హిందువుల మనసులలో గందరగోళం నెలకొనేటటువంటి ప్రమాదం తయారైందని స్వామీజీ అన్నారు. మహా సంప్రోక్షణ నెపంతో భక్తులను రానివ్వకండా చేయడం సమంజసం కాదన్నారు. భక్తుడికి-దేవుడికి మధ్య గోడలు కట్టొద్దని స్వామీజీ విజ్ఞప్తి చేశారు. తక్షణమే ప్రభుత్వం స్సందించాలని.. మహా సంప్రోక్షణ అంటే ఏంటో వివరించాలని, అలాగే భక్తులకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించాలని స్వామీజీ కోరారు. మహా సంప్రోక్షణ అనేది పెద్ద క్రతువు అని. ప్రతి 12ఏళ్లకు ఒకసారి ప్రతి దేవాలయంలో జరిగే కార్యక్రమం అని స్వామీజీ చెప్పారు.

భగవంతుడికి, భక్తుడికి మధ్య అడ్డురాకండి-స్వామి పరిపూర్ణానంద

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here