
Shyamala Pancastsvara Varnamalika Stotram Lyrics In Telugu
జ్ఞాన ప్రదాయకం శ్యామలా పంచాశత్స్వర వర్ణమాలికా స్తోత్రాన్ని క్రమం తప్పకుండా పఠిస్తే పని లో ఏకాగ్రత, స్పష్టమైన విషయావగాహన , జ్ఞానం సిద్ధిస్తాయి. చదువుకునే పిల్లలకు ఇది అత్యంత ఉపయోగకరం. వారికిమాత్రమే కాదు, జ్ఞానమూ ఆనందమూ ఎవరికైతే అవసరమో వారంతా శ్యామలాపంచాశత్స్వర వర్ణమాలికాస్తోత్రం పఠించవచ్చు.
శుచిగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. మనసులో అమ్మవారిని భావించి దీపారాధన చేసి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా మండలం రోజులు (40) పారాయణ చేయాలి. ఫలితంగా మేధస్సు, జ్ఞానం వృద్ధి చెందుతాయి.
శ్రీ శ్యామలాపంచాశత్స్వర వర్ణమాలికాస్తోత్రం
వన్దేహం వనజేక్షణాం వసుమతీం వాగ్దేవి తాం వైష్ణవీం
శబ్ద బ్రహ్మమయీం శశాంకవదనాం శాతోదరీం శాంకరీమ్ |
షడ్బీజాం సశివాం సమంచితపదామాధారచక్రే స్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 1 ||
బాలాం భాస్కరభాసమప్రభయుతాం భీమేశ్వరీం భారతీం
మాణిక్యాంచితహారిణీమభయదాం యోనిస్థితేయంపదాం |
హ్రాం హ్రాం హ్రీం కమయీం రజస్తమహరీం లంబీజమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 2 ||
డం ఢం ణం త థమక్షరీం తవ కళాంతాద్యాకృతీతుర్యగాం
దం ధం నం నవకోటిమూర్తిసహితాం నాదం సబిందూకలాం |
పం ఫం మన్త్రఫలప్రదాం ప్రతిపదాం నాభౌసచక్రే స్థితాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 3 ||
కం ఖం గం ఘ మయీం గజాస్యజననీం గానప్రియా మాగమీం
చం ఛం జం ఝం ఝణ క్వణి ఘణు ఘిణూ ఝంకారపాదాం రమాం |
ఞం టం ఠం హృదయే స్థితాం కిణికిణీ నాదౌ కరౌ కంకణాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 4 ||
అం ఆం ఇం ఇమయీం ఇహైవ సుఖదామీకార ఉఊపమాం
ఋం ౠం లుం సహవర్ణపీఠనిలయే లూంకార ఏం ఐం సదా |
ఓం ఔం అన్నమయే అః స్తవనుతాం మానంద మానందినీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 5 ||
హం క్షం బ్రహ్మమయీం ద్విపత్రకమలాంభ్రూమధ్యపీఠే స్థితాం
యీళా పింగళమధ్యదేశగమనామిష్టార్థసందాయినీం |
ఆరోహ ప్రతిరోహయంత్రభరితాం సాక్షాత్సుషుమ్నా కలాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 6 ||
బ్రహ్మేశాది సమస్త మౌనిఋషిభిర్దేవైస్సదా ధ్యాయినీం
బ్రహ్మస్థాననివేశినీం తవ కలాం తారం సహస్రాంశకే |
ఖవ్యం ఖవ్యమయీం ఖగేశవినుతాం ఖం రూపిమోంకారిణీం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 7 ||
చక్రాణ్యే సతు సప్తమంతరగతే వర్ణాత్మికే తాం శ్రియం
నాదం బిందుకళామయీంశ్చరహితే నిశ్శబ్ద నిర్వ్యాపకే |
నిర్వ్యక్తాం చ నిరంజనీం నిరవయాం శ్రీయన్త్రమాత్రాం పరాం
చిద్రూపాం సకలేప్సితార్థవరదాం బాలాం భజే శ్యామలామ్ || 8 ||
బాలామాలమనోహరాం ప్రతిదినం వాంఛంతి వాచ్యం పఠేత్
వేదే శాస్త్ర వివాదకాలసమయే స్థిత్వా సభామధ్యమే |
పంచాశత్స్వరవర్ణమాలికమియాం జిహ్వాగ్ర సంస్థా పఠే-
ద్ధర్మార్థాఖిలకామవిక్షితకృపాస్సిధ్యంతి మోక్షం తథా || 9 ||
ఇతి శ్యామలాపంచాశత్స్వరవర్ణమాలికా స్తోత్రం
Related Posts
శ్రీ భువనేశ్వరీ స్తోత్రం – Sri Bhuvaneshwari Stotram in Telugu