ఒక ఎర్ర గులాబి కథ !! | Story of Red Rose in Telugu

0
10038
red rose story
ఒక ఎర్ర గులాబి కథ !! | Story of Red Rose in Telugu

Story of Red Rose in Telugu

అందమైన ఒక వసంత కాలపు రోజున అడవిలో ఒక అందమైన ఎర్ర గులాబి పువ్వు వికసించింది.అడవిలో ఎన్నోరకాల చెట్లు ,మొక్కలు పెరుగుతుంటాయి.

ఆ ఎర్ర గులాబీ పువ్వు తన చుట్టూ చూస్తుండగా దగ్గరలో ఉన్న ఒక పైన్ చెట్టు “అబ్బా ఎంత అందంగా ఉంది” ఈ గులాబీ పువ్వు ! నేను కూడా అంత అందంగా ఉంటే ఎంత బాగుండేది! ” అని అనుకుంది”.

మరొక చెట్టు, పైన్ చెట్టుతో ,”ఓ ప్రియమైన వృక్షమా,విచారంచవద్దు ! అందరికీ అన్నీ ఉండటం సాధ్యం కాదు!”అని అన్నది.

ఈ మాటలు విన్న ఆ గులాబీ పువ్వు తన తలని తిప్పుతూ ” బహుశా ఈ అడవిలో ఇంత అందమైన పువ్వులు కల మొక్క నేను మాత్రమే ఉన్నాను కాబోలు.”

అని అనుకుంది.అప్పుడు తన పక్కనే ఉన్న పొద్దుతిరుగుడు పువ్వు పచ్చని తన తల పైకి ఎత్తి గులాబీ పువ్వుతో “నువ్వు అలా ఎందుకు అనుకుంటావు!”

ఈ అడవిలో అందమైన మొక్కలు ఎన్నో ఉన్నాయి, నువ్వు వాటిలో ఒక దానివి మాత్రమే అంటుంది .ఎర్ర గులాబీ, దీనికి సమాధానంగా ,”అందరూ నా వైపే చూస్తున్నారు ,ఎంతగానో నన్ను ఆరాధిస్తున్నారు , నువ్వు కూడా చూస్తున్నావు కదా” అని జవాబు ఇస్తుంది.

ఆ తరువాత ఎర్ర గులాబీ, అక్కడ ఉన్న ఒక ముళ్ళ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ “ఆ చెట్టు ….నిండా ముళ్ళతో, ఎంత అందవికారంగా ఉన్నదో!”అన్నది ఎర్ర గులాబి.

అప్పుడు పైన్ చెట్టు ఎర్రగులాబీ తో, “ఓ ఎర్ర గులాబీ ! నువ్వు ఎందుకిలా మాట్లాడుతు న్నావు? అందమంటే ఏమిటో యెవరు చెప్పగలరు ? నీకు కూడా ముళ్ళు ఉన్నాయి కదా !

అప్పుడు ఎర్ర గులాబీ పువ్వు పైన్ చెట్టు వైపు కోపంగా చూస్తూ “నీకు చాలా చక్కని అభిరుచి ఉన్నది అని అనుకున్నాను .నీకు అసలు అందమంటే ఏమిటో తెలియదు .నాకున్న ముళ్ళను ఆ కాక్టస్ ముళ్ళతో పోల్చటానికి వీలు లేదు ” అన్నది.

ఇదంతా విని “ఎంత గర్వపోతు ఈ ఎర్రగులాబీ”అనుకున్నాయి ఆ మిగతా చెట్లు.కాక్టస్ చెట్టు నుండి దూరంగా తన వేళ్ళను కదపాలని చాలా ప్రయత్నించింది ఎర్రగులాబీ ,కానీ కదల్చలేకపోయింది! అలా రోజులు గడుస్తున్నాయి .

ఎర్ర గులాబీ కాక్టస్ చెట్టు వైపు చూస్తూ దానిని అవమానపరిచే విధంగా “ఈ చెట్టు ఎంతపనికి మాలినది ?ఇలాంటి చెట్టుకు పొరుగున ఉండటం ఎంత విచారకరం!అంటూ ఉండేది.కానీ ,కాక్టస్ ఎంతమాత్రమూ చలించకుండా గులాబీకి సలహా ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ” భగవంతుడు ఏ ప్రయోజనమూ లేకుండా దేనినీ సృష్టించలేదు.

“అని చెప్పేది. వసంతఋతువు వెళ్ళిపోయింది .మెల్లగా ఎండలు ఎక్కువయిపోయినాయి. వర్షంలేకుండా ఎండ ఎక్కువగా ఉండటం వలన చెట్ట్లన్నీ నీళ్ళకోసం దాహంతో అలమటించసాగాయి .ఎర్ర గులాబీ చెట్టు ఎండిపోసాగింది .

కొన్ని పిచుకలు కాక్టస్ చెట్టు పై వాలి ,తమ ముక్కులతో ఆ చెట్టుని పొడిచి ఎంతో ఆహ్లాదంగా ,ఆనందంగా ఎగిరి పోవటం ఎర్రగులాబీ చూసింది.

ఈ విషయం ఆశ్చర్యంగా అనిపించి ఎర్రగులాబీ పైన్ చెట్టును,” ఈ పక్షులు ముళ్ళచెట్టు పైన ఏమి చేస్తు న్నాయని అడిగింది.కాక్టస్ చెట్టు నుంచి పక్షులు నీళ్ళు తాగుతున్నాయి అని, పైన్ చెట్టు చెప్పింది .” పక్షులు అలా చెట్టును పొడిచి కన్నాలు చేస్తే చెట్టుకునొప్పిగా ఉండదా?”

అని ఎర్ర గులాబి పైన్ చెట్టుని అడిగింది.”నిజమే,కానీ పక్షులూ దాహంతో అలమటించటం. బాధ పడటం కాక్టస్కి ఇష్టం ఉండదు. “అని చెప్పింది పైన్ చెట్టు. ఆశ్చర్యంతో కళ్ళు విప్పార్చి చూస్తూ ఎర్ర గులాబీ “కాక్టస్ లో నిజంగా నీళ్ళు ఉంటాయా? అని అడిగింది .”

ఔను! నీవు కూడా కావాలంటే ఆ నీళ్ళు తాగొచ్చు “కాక్టస్ని నీవు సహాయం అడిగితే ,పిచుక నీకు నీళ్ళు తెచ్చి ఇస్తుంది” అని చెప్పింది.తాను గతం లో కాక్టస్ గురించి అన్న మాటలు తలుచుకుని ,ఎర్రగులాబీ చాలా సిగ్గు పడింది. చివరికి ఎర్రగులాబి, కాక్టస్ని సహాయం అడిగంది.

కాక్టస్ ఎంతో దయతో అంగీకరించింది .పక్షులు తమ ముక్కులతో కాక్టస్నుంచి నీళ్ళు గ్రహించి తెచ్చి ఎర్ర గులాబీ చెట్టు వేళ్ళకు నీళ్ళను అందించాయి .ఆ విధంగా ఎర్రగులాబీ పాఠం నేర్చుకుంది.ఆ తరువాత ఎర్ర గులాబీ, ఎప్పుడూ ఆకారాన్ని ,రూపాన్ని బట్టి, ఎవ్వరి గురించి మాట్లాడటం గానీ ,విమర్శించటం గానీ మానేసింది.

నీతి: పైకి కనిపించే రూపాన్ని బట్టి ఎవ్వరి గురించీ అంచనా వేయకూడదు. రూపాలు మన కళ్ళని మోసం చెస్తాయి .వ్యక్తుల పనులవలన మాత్రమే వారిని గురించి తెలుసుకోగలము కానీ వారి రూపాన్ని బట్టి, స్వభావాన్ని గ్రహించలేము!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here